
ఎర్ర సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి ఆర్.నారాయణమూర్తి హీరోగా ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమా ఇటీవల రామోజీరావు చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను చదలవాడ శ్రీనివాసరావు స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. నారాయణమూర్తికి భార్యగా నటిస్తోన్న జయసుధ షూటింగ్ కు ఆలస్యంగా వస్తోందన్న ఉదంతంలో శ్రీనివాసరావుకు – జయసుధకు మధ్య వాగ్వివాదం జరిగినట్లుగా హల్చల్ చేస్తున్న టాక్.
ఉదయం 8.45 నిముషాలకు హాజరు కావాల్సిందిగా దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కోరుతున్నప్పటికీ, జయసుధ 10 గంటలకు విచ్చేస్తున్నారని, దీంతో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదంలో ఖచ్చితంగా 8.45కే రావాలని శ్రీనివాసరావు చెప్పడంతో, ఈ సినిమానే తానూ చేయను అని సినిమా సెట్స్ నుండి జయసుధ వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లుగా అందుతున్న సమాచారం. అయితే ఈ ఒక్క సినిమానే కాదు, ఏ సినిమా షూటింగ్ కు అయినా జయసుధ 10 గంటలకే హాజరు అవుతారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ నుండి వెళ్ళిపోయిన జయసుధకు, సినిమా దర్శకనిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమేరకు షూటింగ్ జరపడంతో, ఇప్పుడు జయసుధ వాకౌట్ అయితే, ఇప్పటివరకు జరిపిన షూటింగ్ నిర్వీర్యం అవుతుందని, దీంతో ఇదే విషయాలను ఇరువర్గాలకు చెప్పి సయోధ్య కుదిర్చే కార్యక్రమాలను చిత్ర యూనిట్ సభ్యులలో పలువురు భుజాన వేసుకున్నారట.
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…