
జీవన్ రెడ్డికి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడుతో ఏవిధంగానూ సంబంధం లేదు. ఏ రోజూ చంద్రబాబు గురించి మాట్లాడింది లేదు. నలబై ఏళ్ళు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు పాట మొదలు పెట్టేశారు. దటీజ్ గులాబీ స్పిరిట్! అనుకోవాలేమో?
ఇంతకీ ఆయన నోట చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎందుకొచ్చింది? అంటే సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడానికి! ఆయన జగిత్యాలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ రేవంత్ రెడ్డి తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అనుకుంటున్నారు. ఆ పార్టీ అధిష్టానం కూడా అదే అనుకుంటోంది.
కానీ బిజేపి పెద్దలతో టచ్‌లో ఉన్నారు. ఏదో రోజు రేవంత్ రెడ్డి బిజేపిలోకి జంప్ అయిపోవడం ఖాయం. ఆయనకు-బిజేపి పెద్దలకు మద్య రాయబారం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఉండనే ఉన్నారు. ఆయనే తనను బిజేపి ఒడ్డుకి చేర్చుతారని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు.
నాలాంటి నిఖార్సయిన సీనియర్ నేతలను కాదని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి లాంటి వారిని, వారి మాటలను ఎందుకు గుడ్డిగా నమ్ముతోందో నాకు అర్థం కావడం లేదు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. అయినా ఇలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు విని ఎందుకు నా వంటి వాళ్ళను దూరం చెసుకుంటోందో అర్థం కాదు.
ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు. ఇప్పుడు పదవీ, అధికారం తప్ప కాంగ్రెస్ అధిష్టానానికి మరేమీ అవసరం లేదు. ఇలాంటి వాళ్ళతో పార్టీని ఇలా నడిపిస్తే భవిష్యత్‌లో ఎదురు దెబ్బలు తప్పవు,” అని జీవన్ రెడ్డి అన్నారు.
ఒకప్పుడు కేసీఆర్‌ని నిందించిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పంచనే చేరడం తప్పనుకోవడం లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ నేతలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి కేసీఆర్‌ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి, భవిష్యత్‌లో పార్టీ మారవచ్చని అందుకు చంద్రబాబు నాయుడు ఆయనకు తోడ్పడవచ్చనే ఊహనితమైన ఆలోచనతో జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అయినా రేవంత్ రెడ్డి బిజేపిలో చేరితే ఆయనకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుందా?తెలంగాణ బిజేపిలో ఇంత గౌరవ మర్యాదలు లభిస్తాయా? అంటే కాదనే అర్ధమవుతోంది.
అయినా బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలనుకుంటే నేరుగా ఆయననే ఎదుర్కోవాలి. కానీ మధ్యలో చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోవడం దేనికి? అంటే అయన నామస్మరణతోనే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ముడిపడి ఉంది కనుక. కానీ జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరి 24 గంటలు కాక మునుపే గులాబీ కళ్ళద్దాలు పెట్టుకొని లోకాన్ని గులాబీ రంగులో చూస్తూ అప్పుడే గులాబీ బాస్ వ్రాసిన పాటలు నేర్చేసుకొని పాడుతునందుకు ఆయనని అభినందించాల్సింసిందే!
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…
Madhuri Jain gives traditional saree styling a moody, modern pulse in this striking photoshoot. Draped…