
ఇవాల్టి నుండి టీవీలలో డిబేట్ లు పెట్టండి… అంతు చూస్తా… అంటూ ఒకానొక సమయంలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. మీ టీఆర్పీల కోసం మా జీవితాలను బలి చేస్తారా? గత మూడు, నాలుగు రోజుల నుండి మా ఇంట్లో పిల్లలు, మేము నిద్ర కూడా పోలేదని, ఎవరి నోటికొచ్చినట్లు వాళ్ళు మాట్లాడితే ఊరుకోనని, వీళ్ళంతా ఏమైనా చిన్న పిల్లలా? అవతల వాళ్ళు ఏది పడితే అది చేయడానికి అంటూ ప్రతిస్పందించారు. మా ఇంటి నుండి మా ఇద్దరు పిల్లలు కూడా హీరోయిన్లుగా రాబోతున్నారని, కాస్టింగ్ కౌచ్ ఉంటే తామెందుకు ప్రోత్సహిస్తామని అన్నారు.
ఒకవేళ ఆమెకు అన్యాయం జరిగితే ఆమె తరపున మాట్లాడడానికి తాను సిద్ధమని అన్నారు. దగ్గుపాటి అభిరామ్ తో ఉన్న ఫోటోలను బయట పెట్టారు, అందులో ఎవరైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా? లేక సంతోషంతో సెల్ఫీ తీసుకున్నట్లు ఉందా? ఎవరైనా ఒకసారి, రెండు సార్లు మోసపోయాం అంటే అర్ధముంటుంది గానీ, పదేళ్ళ నుండి మోసపోయామంటే సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ఇండస్ట్రీ నుండి ఎవరూ ముందుకు రావడం ఆశ్చర్యపరిచిందని, అయినా ఈ ఇండస్ట్రీపై ఉన్న అభిమానంతో నేను ముందుకు వచ్చానని జీవిత తెలిపారు.
ఇది విన్న తర్వాత అయినా జమున, విజయనిర్మల, జయసుధ, జయప్రద వంటి సీనియర్లు బయటకు వచ్చి తమ భావాలను వ్యక్తం చేస్తారని భావిస్తున్నానని జీవిత అభిప్రాయపడ్డారు. ‘కాస్టింగ్ కౌచ్’ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉందని, కానీ సినిమా వాళ్ళ పైనే రాళ్ళు వేస్తున్నారని, ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు కుటుంబంపై గానీ, పారిశ్రామిక వేత్త కుటుంబంపై గానీ ఇలాంటి అభియోగాలు వ్యక్తపరిచారా? అంటూ మీడియా వర్గాలను కూడా ప్రశ్నించారు.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…