
జూన్ 4 ఫలితాల ఆతరువాత వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కండి అంటూ ఒక పక్కన మేకపోతు గాంభీర్యాలు పోతూనే మరోపక్క చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిచి వెళ్ళ్లేటప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీలకు చెప్పే బాధ్యత లేదా అంటూ ఓటమిని అంగీకరిస్తూ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అసలు వైసీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకోవడానికా ? లేక ప్రతిపక్ష పాత్ర పోషించడానికా.? దేనికి సిద్ధం కావాలి అంటూ వైసీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు.
ఓటమి భయంతోనే టీటీడీపీ నేతలు రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్నారని, వైసీపీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేత జోగి రమేష్. అలాగే వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలంటూ పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు విదేశీ పర్యటన మీద కూడా తమ స్పందన తెలియచేసారు. బాబు కనీసం తన ఎల్లో మీడియా కు కూడా ఇవ్వకుండా విదేశాలకు చెక్కేశారంటే దోచుకున్న డబ్బు దాచుకోవడానికేనా అంటూ ప్రశ్నించారు.
జగన్ విదేశీ పర్యటనను తప్పుబట్టిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు బాబు పర్యటనను ఎలా సమర్థిస్తారు అంటూ మంత్రి బొత్స, చంద్రబాబు పరారీలో ఉన్నప్పుడు టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయి అంటూ జోగి తమ ఆక్రోశాన్ని వెళ్లబుచ్చారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికలలో జగన్ ఓటమి తప్పదని కుండబద్దలు కొడుతున్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు వైసీపీ నేతల బుర్రలోకి ఎంత బలంగా చొచ్చుకెళ్ళాయో ఈ రోజు జోగి మాటలు వింటే అర్ధమవుతుంది.
చంద్రబాబు ను విమర్శించాలనే ఆదుర్దా లో బాబు విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు కనీసం ప్రతిపక్షానికి చెప్పే బాధ్యత లేదా అంటూ వైసీపీ పార్టీని ఫలితాలకు ముందే ప్రతిపక్షానికి తీసుకువచ్చేసారు జోగి. ఇన్నాళ్ల నుంచి మీడియా ముందు వైసీపీ నేతలు చెపుతున్న మాటలన్నీ ప్రజలని మభ్య పెట్టడానికేనా అనే సందేహాలు మొదలయ్యాయి. పీకే చెపుతున్నట్టు జూన్ 4 తరువాత వైసీపీ ఓటమిని వైసీపీ నేతలు కూడా అడ్డుకోలేరని జోగి మాటలతో స్పష్టమయింది అంటూ జోగి మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.
JanaSena chief and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan has asked TDP and BJP…
Megastar Chiranjeevi has praised the changes taking place in Andhra Pradesh, highlighting improvements in village…