
ఇంతకీ యార్లగడ్డ ఏమన్నారంటే, “జూ.ఎన్టీఆర్ నాకు ఆప్తమిత్రుడు అని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పుకొంటూ తిరుగుతుంటాడు. అయితే గత 10 ఏళ్ళలో జూ.ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఒక్క ఫోటోని మీలో ఎవరైనా చూశారా? లేదు. ఎందుకంటే జూ.ఎన్టీఆర్ ఆయనను ఎప్పటి నుంచో దూరం పెట్టారు కనుక.
కొడాలి నానికి ఎవరితోనూ స్నేహం లేదు. కానీ ఓట్ల కోసమే దేవినేని రమణ, వంగవీటి రంగల అభిమానినని చెప్పుకొని తిరుగుతుంటాడు. అలాగే జూ.ఎన్టీఆర్ నా ఫ్రెండ్ అని, చిరంజీవి అభిమానినని చెప్పుకొని తిరుగుతుంటాడు. ఇవన్నీ ఓట్ల కోసమే కొడాలి నాని ఆడుతున్న డ్రామాలు,” అని అన్నారు.
కొడాలి నాని గతంలో టిడిపిలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో అందరితో సత్సంబంధాలు ఉండేవి. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్‌తో మంచి స్నేహం ఉండేది. జూ.ఎన్టీఆర్‌తో అదుర్స్ వంటి సూపర్ హిట్ సినిమా కూడా తీశారు. అయితే ఎప్పుడైతే కొడాలి నాని టిడిపిని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి జూ.ఎన్టీఆర్ కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారు.
ఈ విషయం టిడిపి నాయకులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ జూ.ఎన్టీఆర్‌తో నేటికీ తనకు మంచి స్నేహం ఉందన్నట్లు కొడాలి నాని చెప్పుకొని తిరుగుతుంటారు. ఇది కూడా అందరికీ తెలుసు. తద్వారా టిడిపి కార్యకర్తలను, జూ.ఎన్టీఆర్ అభిమానులలో గందరగోళం సృష్టించి, వారిని తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే యార్లగడ్డ నిన్న చెప్పారు.
అంతే కాదు… టిడిపి నేతల మద్య చిచ్చు రగిలించేందుకు జూ.ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఫోటోలతో వైసీపీ ఫ్లెక్సీ బ్యానర్లు పెడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తాజాగా ‘కాబోయే ముఖ్యమంత్రి జూ.ఎన్టీఆర్’ అంటూ గన్నవరం, గుడివాడలో వెలిసిన ఫ్లెక్సీ బ్యానర్లు కూడా అందుకే. ఇవన్నీ టిడిపి నాయకులందరికీ తెలుసు. కానీ ఎవరూ కూడా కొడాలి నానిని పట్టించుకోకపోవడంతో ఆయన చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారు.
ఈ విషయాన్ని నాలుగు రోజుల క్రితం టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకటరావు నిన్న గన్నవరంలో సభాముఖంగా చెప్పి టిడిపి నేతల కళ్ళు తెరిపించారనుకోవచ్చు. జూ.ఎన్టీఆర్ పేరుతో కొడాలి నాని ఆడుతున్న ఈ మైండ్ గేమ్‌ని టిడిపి నేతలు ఇకనైనా గట్టిగా అడ్డుకోకపోతే పార్టీకి జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించలేరు.
కొడాలి నాని జనసేనకు కూడా ఇదే ఫార్ములా అమలుచేస్తున్నారు. రెండు వారాల క్రితమే మెగాస్టార్ చిరంజీవిఅంతటివాడిని ‘పకోడీగాళ్ళు మాకు ప్రభుత్వం ఎలా నడిపించాలో సలహా ఇస్తున్నారు’ అంటూ చాలా చులకనగా మాట్లాడిన కొడాలి నాని, దాంతో చిరంజీవి అభిమానులు తనకు దూరం అవుతారని గ్రహించి, నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో కేక్ కట్ చేసి చిరంజీవి అంటే నాకు చాలా అభిమానం, గౌరవం అంటూ డైలాగ్స్ చెప్పడం అందరూ విన్నారు.
అంటే నేటికీ చిరంజీవి వైసీపీవైపే ఉన్నారనే తప్పుడు సంకేతాలు పంపుతూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులలో అయోమయం సృష్టించి జనసేనను రాజకీయంగా దెబ్బ తీయాలని కుట్ర పన్నుతున్నట్లు అర్దమవుతోంది. కనుక జనసేన నేతలు కూడా కొడాలి నాని ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్‌ని అడ్డుకోకపోతే జనసేన కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…