
ముఖ్యంగా శరీరంలోని నరనరాలు కనిపించే విధంగా ఉన్న తారక్ పోస్టర్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ పోస్టర్ కు సంబంధించి ఓ ఊహించని పుకారు నెట్టింట షికారు చేస్తోంది. ఎన్టీఆర్ ఫిజిక్ లో కాలు భాగం ఫోటోషాప్ చేసి రిలీజ్ చేసినట్లుగా ఓ వార్త హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు శారీరకంగా చాలా కష్టపడిన విషయం తెలిసిందే. మరి అయినప్పటికీ ఈ ఫోటోషాప్ ఎందుకు చేసారో? అన్న ప్రశ్న తలెత్తక మానదు. బహుశా ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ కోసం చిత్ర యూనిట్ ప్రయత్నించారేమో?!
ఒకవేళ ‘ఫోటోషాప్’ చేసినా, లేకున్నా సినిమాపై ఎలాంటి ప్రభావం ఉండబోదు. పెద్ద సినిమాలకు ఇలాంటి పుకార్లు చాలా సహజమే కదా! అందులోనూ సినిమా రిలీజ్ కు దగ్గరవుతున్న కొద్దీ ఇలాంటివి మరిన్ని సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.
ఇప్పటికే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా సిద్ధమవుతున్న “ఆర్ఆర్ఆర్” ధియేటిరికల్ ట్రైలర్ డిసెంబర్ 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదనేది సినీ వర్గాల నుండి లభిస్తోన్న సమాచారం.
In the 47th match of IPL 2026, Mumbai Indians defeated Lucknow Super Giants by six…
Prabhas is currently juggling multiple high-budget pan-India films, and scheduling issues are starting to affect…