
ఆచార్య సినిమా తో ఒక స్టార్ డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడచ్చో పర్సనల్ గా మరియు ప్రొఫెషనల్ గా నలిగి పోయిన శివ కి ఎన్టీఆర్ దేవర అనేది ఎత్తిన ప్రతి నోరూ మూయించే అవకాశం.
ఇప్పడిదాకా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే తీసిన కొరటాల ఫస్ట్ టైం తన కెరీర్ లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ నే టేక్ అప్ చేసాడు.
దేవరకి ఇక నుంచే వచ్చే ప్రతి మెటీరియల్ హైప్ ని పెంచుకుంటూ పొవాలేకానీ ఎక్కడా డౌట్ తెప్పించకూడదు, పర్వాలేదు లే అనే కామెంట్ అసలే రాకూడదు.
హై ఫామ్ లో ఉన్న అనిరుద్ ఈ మధ్య, జవాన్, జైలర్ సినిమాలకి చెప్పి మరీ కొట్టాడు అనే టైపు లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డెలివర్ చేసాడు. ఇప్పుడే అదే స్టైల్ లో దేవర కి రాబోతున్న షార్ట్ టీజర్ వీడియో కి కూడా ట్వీట్ వేయడంతో హైప్ మీటర్ లెగిసినట్టయింది.
కానీ అనిరుద్ వర్క్ కి తగ్గ విజువల్ ‘ఫీల్’, రావాల్సిన ‘హై’ కొరటాల నుంచి వస్తుందా లేదా అనేది చూడాలి.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఎన్టీఆర్ లుక్ ‘బానే’ ఉంది అనే టాక్ ఉంది. ఇక నుంచి వచ్చేదేదయినా భలే ఉంది, అదిరింది అనే దాంతోనే స్టార్ట్ అవడం ముఖ్యం.
ఇప్పటికయితే అనిరుద్ హైప్ మీటర్ సెట్ చేసాడు, కొరటాల అందుకున్నాడా లేదా అందేది వీడియో వచ్చాకే తెలిసేది.
Jailer 2 featuring Rajinikanth is grabbing all the attention on social media as it happens…
Junior NTR's upcoming film Dragon, directed by Prashanth Neel, has faced several production delays since…