‘దేవర’ మాట ఇచ్ఛాటంటే తప్పడు…అదే ఫిక్స్..!

సినిమా కథ నుండి సినిమా స్క్రిప్ట్ తెర మీదకు తెచ్చేవరకు దర్శక నిర్మాతలు ఒకరకమైన యుద్ధం చేస్తే, సినిమాను థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మరో రకమైన యుద్ధం చేయాల్సి వస్తుందని తాజా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ సమయంలో తన ఆవేదనను పంచుకున్నారు.

ADVERTISEMENT

అయితే ఇదంతా చిన్న సినిమాల విషయంలోనే అనుకుంటే పొరపాటే అవుతుంది. ఒక్కోసారి పెద్ద హీరోల రిలీజ్ విషయంలో కూడా ఈ డేట్ ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదనేది రవితేజ ఈగల్ విషయంలో రుజువయ్యింది. సంక్రాంతికి హనుమాన్ తో పాటుగా మహేష్, వెంకటేష్, నాగార్జున రావడంతో థియేటర్ల సమస్య సర్దుబాటు చేయలేక ఈగల్ టీమ్ ను సంక్రాంతి బరి నుండి తప్పించి ఫెబ్రవరీ 9 సోలో రిలీజ్ కి ఒప్పించారు టాలీవుడ్ చిత్ర నిర్మాణ మండలి.

అయితే ఇప్పుడు అదే సమయానికి ఊరుపేరు భైరవకోన రావడం అటు ఈగల్ టీమ్ తో పాటు నిర్మాత మండలికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈగల్ కోసం వెనక్కి వెళ్లిన డీజే టిల్లు మార్చి నెలాఖరుకు వెళ్లగా వారిని దేవర రిలీజ్ డేట్ భయపెడుతుంది. దీనితో సోషల్ మీడియాలో సినిమాల విడుదల తేదీల పై రూమర్స్ మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ దేవర కూడా తన రిలీజ్ డేట్ మార్చుకుని వెనక్కి వెళ్ళిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో దేవర టీమ్ ఎన్టీఆర్ ఫాన్స్ కు క్లారిటీ ఇచ్చారు. మేము ముందుగా అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అంటూ దేవర పోస్టర్ పైన తమ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ చేసి అప్డేట్ చేసింది చిత్ర యూనిట్.

ఏప్రిల్- 5 – 2024 న దేవర మూవీ థియేటర్లలో సందడి చేయనుంది అంటూ అటు ఎన్టీఆర్ అభిమానులకు ఒక సందేశాన్ని, సినీ పరిశ్రమకు ఒక సంకేతాన్ని పంపించింది దేవర చిత్ర బృందం. ఇక నో కన్ఫ్యూజన్…ఏప్రిల్ 5 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూడాల్సిందే. కొరటాల దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్ సమర్పణలో, జాహ్నవికపూర్ హీరోహిన్ గా రూపొందుకుంటున్న దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన దేవర గ్లిమ్స్ ఎర్ర సముద్రంతో సినిమా పై అంచనాలను పెంచేసింది. పెంచిన అంచనాలను ఏమేరకు అందుకుంటుందో తెలియాలనంటే ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బొద్దింకలు మాకు థాంక్స్ చెప్పాయి.. అందరూ విన్నారా?

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…

18 minutes ago

Career Setbacks, Social Media Trolls: Cricketer Breaks Silence

Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…

27 minutes ago