Telugu

జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ సందేశం!

ప్రస్తుతం ధియేటర్లలో కనకవర్షం కురిపిస్తోన్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో జూనియర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ విమర్శకులను సైతం మెప్పించిన తారక్ అభినయానికి అభిమానులు నీరాజనాలు పలుకుతుండగా, భావోద్వేగంతో తారక్ కూడా ఓ పెద్ద లేఖనే ముద్రించి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.

‘థాంక్యూ’ అంటూ రిలీజ్ చేసిన ఈ నోట్ లో సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున సంబోధిస్తూ కృతజ్ఞతలు తెలిపారు తారక్. ముందుగా “ఆర్ఆర్ఆర్”ను తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పారు. తనలోని నటుడిని వెలికితీసేలా ఇన్స్పైర్ చేసి, ఓ నటుడిగా మరింత రాటుదేలాల చేసిన జక్కన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ADVERTISEMENT

ఇక సోదరుడు చరణ్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు తారక్. నువ్వు లేకుండా “ఆర్ఆర్ఆర్”లో నటించడాన్ని ఏ మాత్రం ఊహించుకోలేకపోతున్నాను. నువ్వు తప్ప అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ను మరో హీరో చేయలేడు. నువ్వు లేకుండా “ఆర్ఆర్ఆర్” మాత్రమే కాదు, భీమ్ కూడా లేడు. నా వాటర్ కు ఫైర్ గా ఉన్నందుకు థాంక్స్ అంటూ వ్యక్తపరిచిన తారక్ అక్షరాల్లో భావోద్వేగం కనపడుతోంది.

వీరితో పాటు అజయ్ దేవ్ గణ్, అలియా భట్, నిర్మాత దానయ్య, సంగీత దర్శకులు కీరవాణి, కధా రచయిత విజయేంద్రప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మరియు ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమా పట్ల అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఇండియన్ మీడియాకు కూడా ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు తారక్.

చివరగా ప్రస్తావించింది మాత్రం అభిమానులను ఉద్దేశించే! ‘లాస్ట్ బట్ నాట్ లీస్ట్’ అంటూ నా హృదయ పూర్వకంగా మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ నిస్వార్థమైన ప్రేమ, అభిమానమే నన్ను ఇలా నడిపిస్తోంది. మిమ్మల్ని ఇలాగే మరిన్ని సినిమాలతో అలరిస్తూ ఉంటాను… అంటూ “ఆర్ఆర్ఆర్” గురించి ప్రస్తావిస్తూ ముగించారు జూనియర్ ఎన్టీఆర్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vaazha 2: Blockbuster in Theatres, Overrated on OTT?

Vaazha II: Biopic of a Billion Bros directed by Savin SA was released in theatres…

13 minutes ago

Photos: PM Modi Visits CBN, PK Residence

Photos: PM Modi Visits CBN, PK Residence

33 minutes ago