Telugu

ఏడుపు ఆపుకుంటున్నాను – జూనియర్ ఎన్టీఆర్!

“జనతా గ్యారేజ్” విజయం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ పక్కన తన కంటే వెనుక వచ్చిన అల్లు అర్జున్ లాంటి వారు కూడా ‘బ్లాక్ బస్టర్’లను అందుకుంటుంటే… మరో పక్కన పన్నెండు, పదమూడు సంవత్సరాలుగా ‘బ్లాక్ బస్టర్’ కోసం వేచిచూస్తున్న తరుణంలో… యంగ్ టైగర్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమాగా ‘జనతా గ్యారేజ్’ రికార్డు వసూళ్లు రాబట్టింది. అయితే తొలి రోజు వచ్చిన టాక్ రీత్యా, ఈ సినిమా ఈ రేంజ్ కు చేరుకుంటుందని చాలా మంది ఊహించినది కాదు.

‘ఫస్ట్ డే’ వెలువడిన టాక్ పై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ‘జనతా గ్యారేజ్’ విజయోత్సవ వేడుకలో మరోసారి తన ఏమోషనల్ భావాలను వ్యక్తపరిచారు. ఈ సినిమా విడుదలైన తర్వాత వివిధ ధియేటర్లలో రకరకాల టాక్ వచ్చిన నేపధ్యంలో… తానూ ఆడియో వేడుక పైన చెప్పిన మాటలు తప్పవుతాయా… శివపై ఉంచిన నమ్మకం తప్పవదే… ఈ సినిమా కధపై ఉంచిన విశ్వాసం తప్పవదే… అభిమానులకు నేను ఇచ్చిన మాట తప్పవదే… అంటూ నాలో నేనుతెగ మదనపడిపోయాయని, అయితే ఆ తర్వాత సినీ ప్రేక్షకుల నుండి, అభిమాన సోదరుల నుండి వెలువడిన టాక్… ఎస్… నా అంచనాలు తప్పు కాలేదని నిరూపించాయని ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు ‘యంగ్ టైగర్.’

ADVERTISEMENT

“చాలా విషయాలు చెప్పాలని ఉంది… ఓ పక్కన ఏడుపు ఆపుకుంటున్నాను… ఆనంద భాష్పాలతో వచ్చే ఏడుపు ఆపుకుంటున్నాను… మీ అందరి ముందు తలెత్తుకునే విధంగా ‘జనతా గ్యారేజ్’ను తనకు అందించిన కొరటాల శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని, పదమూడు సంవత్సరాల తర్వాత దక్కిన ఈ విజయం నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, మధ్యలో విజయాలు వచ్చాయి గానీ, ఇది కదా నేను వేచిచూసిన విజయం… మీరు ఆశించిన సక్సెస్… మీ ఆనందం కోసం ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాను… ఈ జన్మకు ఇది చాలు…” అంటూ కళ్ళు చమర్చారు జూనియర్ ఎన్టీఆర్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mirzapur & Awarapan 2: Big Warning to Akshay and Ajay?

The box office results have become very unpredictable. Amid this, the situation of every big…

14 minutes ago

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

9 hours ago