పాపం ఎన్టీఆర్… ఆ నింద న్యాయం కాదు!

Jr Ntr evaru meelo koteswarulu Trp ratingsయంగ్ టైగర్ ఎన్టీఆర్ టెలివిజన్ హోస్ట్ గా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఆయన తాజాగా హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో మూడవ వారం టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. మొదటి వారం కంటే రెండో వారం…. రెండో వారం కంటే మూడో వారం రేటింగ్స్ బెటర్ గా ఉన్నాయి.

మూడవ వారం రేటింగ్ అటు ఇటుగా ఏడున్నర వచ్చింది. అయితే అదే సమయంలో నాగార్జున బిగ్ బాస్ లాంచ్ డే రేటింగ్ దాదాపుగా 15.71… అదే ఎస్డీ, హెచ్డీ కూడా కలిపితే ఇరవై అని స్టార్ మా ఊదరగొడుతుంది. ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి ఎపిసోడ్… హాట్ సీట్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నా వచ్చింది పదకొండున్నరే..

ADVERTISEMENT

దానితో అది ఎన్టీఆర్ ఫెయిల్యూర్ అంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. అయితే ఇది అసలు న్యాయం కాదు అని అనాలి. స్టార్ మా కు ఉన్న రీచ్ జెమినీకి లేదు. పైగా ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రాం మీద చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన సమయంలో ఇంటరెస్ట్ పోయింది.

పైగా ఇది ఒక క్విజ్ ప్రోగ్రామ్… బిగ్ బాస్ లాగా ఎంటర్టైనింగ్ కార్యక్రమం కాదు. దానితో అన్ని వర్గాల ఆడియన్స్ చూసే అవకాశాలు చాలా తక్కువ. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ ఒక్కడే షోని లాక్కొస్తున్నాడు. కావున ఎన్టీఆర్ ఫెయిల్యూర్ అంటూ బ్లెమ్ చెయ్యడం రిజనబుల్ కాదు.

ADVERTISEMENT
Latest Stories