
ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడే జవాబు దొరకదు గానీ… అసలు ఈ షోలో తారక్ తళుక్కుమననున్నాడనేది అసలు హైలైట్. ప్రస్తుత కాలంలో బుల్లితెరకు ఆదరణ చాలా తక్కువగా ఉన్న సమయంలో… మళ్ళీ పునర్వైభవం ఇచ్చేలా తారక్ కనపడుతున్నాడనేది ట్రేడ్ టాక్. ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రదర్శితమవుతున్న సినిమాలకు వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ చాలా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా చిరు హోస్ట్ చేసిన కార్యక్రమం వైపు కూడా కన్నెత్తి చూసిన వారి సంఖ్య తక్కువే.
మరి ఇలాంటి తరుణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకర్షిస్తారనేది ట్రేడ్ పండితుల అంచనా. అందులోనూ ప్రస్తుతం టాప్ హీరోలుగా చలామణి అవుతోన్న మహేష్, పవన్, ప్రభాస్, జూనియర్ లలో తొలుత బుల్లితెరపై ప్రత్యక్షం కాబోతోంది ‘బుడ్డోడు’ కావడంతో… ఇప్పటివరకు సందడి చేసిన నాగార్జున, చిరంజీవిలతో పోలిస్తే… అటు యూత్ లోనూ, మాస్ వర్గాలలోనూ జూనియర్ కు క్రేజ్ ఎక్కువే కాబట్టి, బుల్లితెరపై ‘బుడ్దోడే’ నెంబర్ 1గా నిలుస్తాడని యంగ్ టైగర్ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…