
‘టాలీవుడ్ లో మీ ఫేవరేట్ డ్యాన్స్ స్టార్ ఎవరు?’ అంటూ యాంకర్ అడగగా… దానికి ఏ మాత్రం తడుముకోకుండా ‘బన్నీ’ అంటూ స్పష్టం చేసాడు తారక్. నిజానికి స్టైలిష్ డ్యాన్స్ లకు అల్లు అర్జున్, మాస్ బీట్స్ కు జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు అందించడంలో అందరి కంటే ముందు వరుసలో ఉంటారని సినీ విమర్శకులు కూడా కితాబిచ్చారు. అయితే ఇలా ఒకరి హీరో పేరును మరో హీరో చెప్పడం మాత్రం బహు అరుదైన విషయమే.
దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సందడి చేస్తోంది. డ్యాన్స్ ల విషయంలో పోటాపోటీగా నిలిచే ఇద్దరిలో… బన్నీ పేరు తారక్ చెప్పడంలో అల్లు ఫ్యాన్స్ ఆనందంతో సదరు వీడియోను షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి అరుదైన వీడియోలకు ఆ మాత్రం హంగామా చేయడంలో తప్పులేదులే మరి..! అయితే సినిమాల విషయానికి వచ్చేపాటికి మళ్ళీ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగే ‘రచ్చ’ రొటినే..!
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar was released in theatres on…
Hemanth, the accused in the Raptadu school attack, was shot by the police after allegedly…