
‘ఎన్టీఆర్ అని పిలిస్తే ఇష్టమా? లేక తారక్ అని అంటే ఇష్టమా?’ అని యాంకర్ ప్రశ్నించగా… ‘తన సన్నిహితులు, స్నేహితులు అంతా తారక్ అని పిలుస్తారని, తనక్కూడా తారక్ అని పిలిస్తేనే ఇష్టమని’ చెప్పిన జూనియర్, ‘ఎన్టీఆర్ అని పిలిస్తే చాలా భయంగా ఉంటుందని, ఆ మహానుభావుడి పేరు తనకు పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, అయితే ఆయన పేరుతో తనను పిలిపించుకునేటంత అర్హత లేదని, అందుకనే భయం వేస్తుందని, ఆయన ఎక్కిన 100 మెట్లలో కనీసం ఒకటో, రెండో ఎక్కడానికే తన తాపత్రయం’ అని చెప్పుకొచ్చారు ఈ అభిమానుల బుడ్డోడు.
అంతకు ముందు చాలా అనర్గళంగా మాట్లాడే జూనియర్, ప్రస్తుతం మాత్రం చాలా ఆచితూచి, ఆలోచించుకుని మాట్లాడుతుండడం విశేషం. చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమయం తీసుకుని మరీ సమాధానాలు చెప్తుండడం తారక్ మారిన వైఖరికి అద్దం పడుతోంది. ‘జనతా గ్యారేజ్’ విడుదలైన తర్వాత ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కాస్త టెన్షన్ గా కూడా ఉందని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ లో వచ్చిన మార్పు ‘జనతా గ్యారేజ్’ విడుదల తర్వాత కూడా ఉంటుందా? చూడాలి..!
Dulquer Salmaan’s I’m Game has not found the expected traction in the Telugu states. The…
Rashmika Mandanna, who recently took a break from work after suffering a hip injury, has…