
ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున ఎన్టీఆర్ అభిమానుల దేవర అప్ డేట్ విడుదలయ్యింది. ఒక్క నిమిషం 20 సెకండ్ల నిడివితో విడుదలైన దేవర గ్లిఫ్స్ మొత్తం సముద్రం మీద, సముద్రం చుట్టూ తిరిగింది.
గ్లిఫ్స్ లో విడుదలైన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ సినిమాలో సముద్రం పోషించే పాత్రను, ఎన్టీఆర్ క్యారక్టర్ ను తెలియచేసేదిలా ఉంది. సముద్రంలో జరిగే స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కబోతున్నట్టుగా ఉంది.
ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ తో చెప్పే “ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని, నెత్తురినే ఎక్కువ చూసుంటాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు” డైలాగ్ తో దేవర గ్లిమ్స్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీని ఎలివేట్ చేస్తూ అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునులే ఉంది. ఆకాశంలో మెరిసే చంద్రవంకను రక్తంతో ఫుల్ మూన్ గా చూపించిన సన్నివేశం చూపారుల దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసింది.
CGI విజువల్స్ బాగున్నాయి. “చిన్న గ్లిఫ్స్ – పెద్ద వైలెన్స్” తరహాలో దేవర గ్లిఫ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏప్రిల్ 5 న సినిమా విడుదలకు ముహూర్తం పెట్టారు మేకర్స్. ఒక బారి డిజాస్టర్ తరువాత వచ్చిన పెద్ద అవకాశం నేపథ్యంలో దర్శకుడు కొరటాల ఎంతో జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారని నిర్మాత కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు భరోసా అందించారు. తొలిసారిగా దేవర మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు జాన్వీ కపూర్.
మరి దేవరతో సముద్రాన్ని ఎరుపెక్కించిన ఎన్టీఆర్, కొరటాల ఎన్టీఆర్ అభిమానులను ఏ మేరకు అలరిస్తారో..,రాజమౌళి హీరోల నెక్స్ట్ మూవీ సెంటిమెంట్ ను తప్పించుకుని ప్రేక్షకుల మెప్పు పొందగలరా? అనేది వేచి చూడాలి.
In the 24th match of IPL 2026 at the Wankhede Stadium, Punjab Kings continued their…
Recently, from Bollywood to Tollywood, many well-known top-tier celebrities have been approaching the Delhi High…