
‘టెంపర్’ సినిమా హాలీవుడ్ తో సహా ఎన్నో భాషలలో రీమేక్ అయ్యింది, అలాంటి సినిమాకు అవార్డు ఇవ్వకుండా, ‘జనతా గ్యారేజ్’కు ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదంతా మెగా, నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య జరుగుతున్న “కోల్డ్ వార్”కు నిదర్శనమా? అని సదరు మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… ‘కోల్డ్ వార్’ కాదు, ‘డైరెక్ట్ వార్’ అని బండ్ల గణేష్ చెప్పడం… ఇండస్ట్రీలోని లొసుగులను బయటపెడుతోంది.
మొన్నటివరకు “అంతా ఒక్కటే” అంటూ బయటకు ఇచ్చిన ‘కలరింగ్’లో వాస్తవం ఎంత ఉందో, ఇప్పుడు ఈ చర్చల ద్వారా ప్రేక్షకులకు తెలిసి వస్తోంది. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా…. అందరూ మాత్రం పైకి “మనం” సినిమా పేరును విచ్చలవిడిగా వాడుకోవడం ఇందులోని కొసమెరుపు. అయితే “మనం” సినిమాను నిర్మించిన, నటించిన అక్కినేని కాంపౌండ్ మాత్రం ఇప్పటివరకు నోరు మెదపలేదు.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…