
అదే సమయంలో మీడియా వేదికలుగా ఒకటి, రెండు సార్లు వివరణ ఇచ్చుకున్న జూనియర్, ఇక రాజకీయాలను వదిలేసి ‘టెంపర్’ సినిమాతో కెరీర్ పరంగా గాడిలో పడ్డారు. ఆ తర్వాత విడుదలైన ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ సినిమాలు కూడా ప్రేక్షకాధరణకు నోచుకోవడంతో, సినిమాలే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. అయితే ఉన్నట్లుండి మళ్ళీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా జూనియర్ ఎన్టీఆర్ పై ఓ వార్త హల్చల్ చేస్తోంది. అందుకు వేదిక అయ్యింది ఇటీవల ముగిసిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.
అభిమానులు ఘనంగా జరుపుకున్న ‘బుడ్డోడు’ పుట్టినరోజు నాడు తన తదుపరి చిత్రంపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో “జై లవకుశ” చిత్రంలో నటిస్తోన్న జూనియర్, ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడని అధికారిక ప్రకటన వెలువడింది. అయితే అభిమానులంతా ఎదురు చూసిన కాంభినేషన్ వేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన రాబోతుందని అంచనా వేయగా, అది కార్యరూపం దాల్చలేదు.
తాజాగా ఇదే కాంభినేషన్ వేదికగా 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఓ వార్త పుట్టుకొచ్చింది. త్రివిక్రమ్ – జూనియర్ కాంభినేషన్ లో సినిమా ఉంటుందని, అయితే అదే వచ్చే ఎన్నికల ముందు ఉండబోతుందని, సదరు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని ఈ వార్తల సారాంశం. ఇందులో ఎంత వాస్తవం ఉందనేది పక్కనపెడితే, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ కధ వైపు మొగ్గు చూపుతారా? అన్నది కీలకంగా మారిన అంశం.
పవన్ గానీ, మహేష్ గానీ, ప్రభాస్ గానీ… ఇలా ఏ హీరో రాజకీయ కధలో నటించినా అది పెద్ద సెన్సేషన్ అవ్వదు గానీ, ఎన్టీఆర్ నటిస్తే మాత్రం ఖచ్చితంగా సంచలనమే అని చెప్పాలి. ఎందుకంటే… జూనియర్ కు – టిడిపికి ఉన్న సంబంధం అలాంటిది! ఇక, త్రివిక్రమ్ విషయానికి వస్తే… నిజంగా రాజకీయ కధ ఉంటే, అది తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించి, ‘జనసేన’కు ఉపయోగపడేలా తీస్తారు గానీ, ఎన్టీఆర్ తోనే ఎందుకు చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న? అందుకని ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల వేదికగా చెలరేగుతున్న ఈ వార్తల్లో వాస్తవం తెలియాలంటే కొన్నాళ్ళ పాటు వేచిచూడాల్సిందే.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…