హీరోల పేరుతో రాజకీయాలు…ఆ విలన్ ఎవరు.?

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ కి సంబంధిన స్టార్ హీరోల పేర్లతో రాజకీయం నడుస్తుంది. పలానా స్టార్ హీరో పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారు, ఆ హీరో పార్టీ పెడితే కాపు సామాజికవర్గం ఓట్లు చీలడం ఖాయం, జనసేన పార్టీకి రాజకీయ ఎదురుదెబ్బ తధ్యం అంటూ సోషల్ మీడియాలో తగ్గేదెలా అంటూ ఆ స్టార్ హీరో పేరు మీద రాజకీయం నడిపించారు.

ఇక అదే కోవలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద కూడా పొలిటికల్ పుకార్లు పుట్టుకొచ్చాయి. తారక్ త్వరలోనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఉపందుకుంది. దీనితో టీడీపీ రాజకీయ పతనం మొదలు అంటూ టీడీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు సోషల్ మీడియాలో నానా హంగామా షురూ చేసారు.

ADVERTISEMENT

దీనితో ‘RAW NTR’ పేరు మీద వస్తున్న ప్రకటనలకు, చేస్తున్న కార్యక్రమాలు తారక్ కు ఎటువంటి సంబంధం లేదంటూ ఎన్టీఆర్ కార్యలయం నుంచి ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి కి సమస్య తీవ్రమయ్యింది. అయితే ఇలా రాజకీయాలకు సంబంధం లేని ఇద్దరు స్టార్ హీరోల పేర్లను రాజకీయాలతో మిళితం చేస్తూ ప్రచారం చేస్తున్న ఆ పొలిటికల్ విలన్స్ ఎవరు అన్నది ఇక్కడ ప్రశ్న.

ఆ స్టార్ హీరోల కుటుంబాలు ఇప్పటికే పొలిటికల్ గా స్థిరపడిపోయిన ఈ తరుణంలో వారి పేర్లతో రాజకీయ పార్టీలు అంటూ ప్రచారం చేయడం ఎవరికి రాజకీయ మైలేజ్ ని ఇస్తుంది. టీడీపీ, జనసేన కేంద్రంగా సాగుతున్న ఈ ప్రచారం ఎవరి మెప్పుకోసం.?

ఆ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే జనసేన పని ఖతం, ఈ హీరో రాజకీయ పార్టీ పెడితే టీడీపీ రాజకీయం ముగిసిన అధ్యాయం అంటూ ఏపీలో అధికారంలో ఉన్న రెండు పొలిటికల్ పార్టీల టార్గెట్ గా సాగుతున్న రాజకీయం ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

అమరావతి కోసం భూమినిచ్చి జైలుకెళ్ళిన ధనేకుల.. చిరస్మరణీయుడు

ఎప్పుడో వంద రెండు వందల సంవత్సరాల క్రితం రాజులు దేవాలయాలకు భూములు, కానుకలు ఇస్తే, రోడ్ల పక్కన మొక్కలు నాటిస్తేనే…

27 minutes ago

Why Gen Z Films Are Struggling to Click in Theatres

There is nothing wrong with making films for youth and Gen Z audiences. In fact,…

31 minutes ago