
ఇది ఇలా ఉండగా సినిమాలోని ఒక హైలైట్ పాట కోసం సెట్ నిర్మిస్తున్నారు. ఈ పాట ఒక జానపదం అని తెలుస్తుంది. ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ డాన్స్ చేస్తారని సమాచారం. ఈ జనరేషన్ లోని మేటి డాన్సర్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు టాప్ లో ఉంటారు. సరైన డాన్సులు పడితే మెగా, నందమూరి అభిమానులకు పండుగే.
ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల చేస్తామని చివరిగా నిర్మాతలు ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది దసరాకు గానీ ఆ పై ఏడాది సంక్రాంతికి గానీ సినిమా వాయిదా పడొచ్చని వార్తలు వస్తున్నాయి. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ వార్తలను ఖండించారు. అనుకున్న ప్రకారమే సినిమా షూటింగ్ జరుగుతుందన్నారు.
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు చిత్రబృందం.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…