
ఈ పరిణామంపై జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. పొరుగుదేశంలో నిర్మించిన చిత్రానికి భారత్ లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతోనే తాను అలా చేసానని, ఇదే విషయాన్ని తన ఆడిటర్లు 2016లోనే లిఖితపూర్వకంగా కాగ్ కు చెప్పడం జరిగిందని తెలిపాడు. ఆ తరువాత దానికి సంబంధించిన నోటీసులు కానీ, ఇతర వివరాలేవీ తనకు అందలేదని… చాలా సంవత్సరాలుగా పన్నులు, సర్వీస్ ట్యాక్సులు క్రమబద్ధంగా చెల్లిస్తున్న వ్యక్తిని తానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇచ్చారు.
భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను తాను ఏనాడూ మరువలేదని, ఈ విషయంలో సంబంధిత అధికారులతో నోటీసులు ఏవైనా అందితే అందులోని వివరాల ప్రకారం అణా పైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రకటించాడు. ఈ విషయంలో వివరాలు తెలియాల్సి ఉందని, చట్టానికి కట్టుబడి ఉండాలని నమ్మే వ్యక్తిని తానని, ఈ విషయంలో కూడా అలాగే ఉంటానని స్పష్టం చేసిన జూనియర్ ఎన్టీఆర్ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సహజంగా ఇలాంటి పరిణామాలపై సెలబ్రిటీలు వేగంగా స్పందించరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా పన్ను చెల్లించలేదంటూ వచ్చిన వార్తలు ఫ్రెష్ గా ఉన్నపుడే దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వడం విశేషం. బహుశా పన్నుల చెల్లింపుల విషయంలో జూనియర్ పూర్తి స్పష్టతతో ఉన్నారని ఈ సంఘటన చెప్పకనే చెప్తోంది. పన్ను కట్టేది లేనిది తర్వాత సంగతి, కానీ తనపై నెగటివ్ భావన రాకుండా జాగ్రత్తపడడంలో జూనియర్ ఎన్టీఆర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు.
Dulquer Salmaan is currently promoting his upcoming film I’m Game, which is also releasing in…
The success of Hanuman Ansh has once again shown the growing pull of devotional cinema.…