Telugu

జూనియర్ ఎన్టీఆర్ “లైఫ్” టర్నింగ్ డే!

చిన్న వయసులోనే మాస్ సినిమాలు చేస్తూ ‘సూపర్ స్టార్ డం’ అందుకున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధముడు. ‘ఇండస్ట్రీ హిట్’ అనే పదాన్ని సరిగ్గా 13 ఏళ్ళ క్రితం “సింహాద్రి” సినిమా ద్వారా తన సొంతం చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం తెలియనిది కాదు. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి, జూనియర్ ఎన్టీఆర్ ను ‘ఆకాశం’లో నిలబెట్టిన సినిమాగా ‘సింహాద్రి’కి ఒక విశిష్టమైన ఖ్యాతి ఉంది.

168 సెంటర్లలో 50 రోజులు, 146 కేంద్రాలలో 100 రోజులు, 52 ధియేటర్లలో 175 రోజులు ప్రదర్శింపబడి టాలీవుడ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అనేటంత స్థాయిని తీసుకువచ్చింది. అప్పట్లో ఈ రికార్డులను చెప్పుకుంటూ జూనియర్ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక్క ఫ్యాన్సే కాదు, ఏ నోట విన్నా ‘సింగమలై…’ అన్న మాట, ఏ వేడుక చూసినా… ‘నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి…’ అన్న పాట మాత్రమే వినిపించేవి. అయితే ఒక రకంగా ఈ ‘సింహాద్రి’ సినిమానే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను మరో మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT

సినిమాల సంఖ్య, ఎన్టీఆర్ వయసుతో పోల్చుకుంటే… అతి చిన్న వయసులోనే దక్కిన ‘మాస్ ఇమేజ్’ జూనియర్ ఆలోచనలపై తీవ్రంగా ప్రభావం చూపాయి. ఈ సినిమా విడుదల తర్వాతే వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ పై ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఫలానా టీవీలో ఏదో అన్నారని, అలాగే ఇండస్ట్రీ వర్గాలను కూడా లెక్కచేయలేదని… ఇలా రకరకాలుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఇండస్ట్రీలో ‘సక్సెస్’ వచ్చిన సమయంలో (ఇటీవల అల్లు అర్జున్ కూడా) మాట్లాడే మాటలు మిక్కిలి ప్రాధాన్యతను, మరింత వివాదాలకు కేంద్ర బిందువవుతాయి.

అలా 13 ఏళ్ళ క్రితం “సింహాద్రి”తో ‘ఆల్ టైం రికార్డులు’ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ ఇప్పటివరకు ఆ దరిదాపులకు కూడా రాకపోవడం గమనించదగ్గ విషయం. మధ్యలో రాజమౌళి ‘యమదొంగ,’ వినాయక్ ‘అదుర్స్,’ పూరీ ‘టెంపర్,’ సుకుమార్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలనైతే సాధించాయి గానీ, ‘సింగమలై’ అభిమానులు ఆశించే ‘ఆల్ టైం రికార్డులను’ మాత్రం అందుకోలేకపోయాయి. అందుకే “సింహాద్రి” విడుదలైన తేదీ జూలై 9 అటు జూనియర్ కు, ఇటు అభిమానులకు ఎంతో మరపురానిది. దీనిని పురస్కరించుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు అభిమానులు.

13 ఏళ్ళ క్రితం అభిమానులను సంబరాల్లో ముంచెత్తడమంటే… 13 సంవత్సరాలుగా అభిమానులు మరో అలాంటి విజయం కోసం వేచిచూస్తున్నట్లే కదా..! మరి ఆ ఘనతను రాబోయే “జనతా గ్యారేజ్” ద్వారా అయినా తన వశం చేసుకుంటాడేమోనని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ పూర్తి నమ్మకాన్ని కలిగించడంతో, ‘జనతా గ్యారేజ్’ విడుదల కాబోయే ఆగష్టు 12వ తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

షర్మిల రీ ఎంట్రీ కోసం జగన్ ఎదురుచూస్తున్నారా.?

వైసీపీ లో షర్మిల రీ ఎంట్రీ, అన్న చెల్లెళ్ళ మధ్య పంచాయితీకి ఎండ్ కార్డు పడింది, వైఎస్ కుటుంబం తిరిగి…

31 minutes ago

FaFa’s DTTT Trailer Mixes Fantasy, Mystery And Comedy

The much-awaited trailer of Don’t Trouble The Trouble is finally out after its grand launch…

53 minutes ago