
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సింహాద్రిని ప్లాన్ చేశారు. ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ ని తెరమీద చూసి ఎంజాయ్ చేయాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పాతిక నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉన్న తారక్ ఫ్యాన్స్ దీన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేసి ఉండరు. సో చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆ రోజు కొత్త సినిమాల రేంజ్ లో తెల్లవారుఝామున స్పెషల్ షోలు వేస్తారట. హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
నైజామ్, వైజాగ్ హక్కులను దిల్ రాజు తీసుకున్నారు. ఇతర ప్రాంతాలకు పెద్ద బయ్యర్లే ముందుకొచ్చారు. వచ్చే వారం శ్రీరాములు థియేటర్లో నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి లిరికల్ వీడియోని పెద్ద ఈవెంట్ తో లాంచ్ చేయబోతున్నారు. ట్రైలర్ కో సెపరేట్ ఈవెంట్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసే ఆలోచన కూడా ఉందట. అయితే తారక్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. సోలోగా స్క్రీన్ మీద తమ హీరోని చూసి నాలుగేళ్లు కావడంతో అభిమానులు దీన్నో పెద్ద సంబరంగా జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు
అసలే స్టార్ హీరోలు రెండేళ్లకో సినిమా చేసే పరిస్థితికి వచ్చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు అందరికీ ఇదే పాట. ఒక్క ప్రభాస్ మాత్రమే రెండు డిజాస్టర్లు ఇచ్చిన పాఠాలు నేర్చుకుని వేగం పెంచి ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైన పెట్టాడు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్ సంవత్సరానికో కొత్త రిలీజును ఎంజాయ్ చేయడం సాధ్యం కావడం లేదు. దాని బదులు ఇలా పాతవాటినే ఫ్రెష్ గా వచ్చినంత హడావిడి చేయాలని డిసైడవుతున్నారు. రాను రాను ఇంకెన్ని పోకడలు చూడాల్సి వస్తుందో మరి
The Supreme Court’s observations on children’s internet access raise a serious question: When laws and…
ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి.…