
ప్రస్తుతం ఆ సినిమా బాలీవుడ్ లోకి తర్జమా అవుతోంది. ఎన్టీఆర్ స్థానంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, పూరీ బాధ్యతలను రోహిత్ శెట్టి చేపడుతున్నారు. దక్షిణాది సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన రోహిత్ శెట్టి, ఈ సారి “టెంపర్” సినిమాను ఎంపిక చేసుకుని, ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.
అయితే ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ మాత్రం ‘టెంపర్’ స్థాయిలో లేదన్నది అసలు న్యూస్. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ క్యారెక్టర్ కు పూర్తి విభిన్నంగా ఈ ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ లో రణవీర్ సింగ్, కామెడీ పోలీస్ గా దర్శనమిస్తున్నాడు. మాస్ కామెడీ ఎంటర్టైనర్స్ ను అందించడంలో దిట్ట అయిన రోహిత్ శెట్టి మన “టెంపర్”ను చెడగొట్టకుండా తీయగలరా? ఇది తెలియాలంటే 28.12.2018 వరకు వెయిట్ చేయాల్సిందే.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…