
ఇటీవల కాలంలో ఆ ఒరవడి ఎక్కువైపోతుండడమే అభిమానులు ఆందోళన చెందేలా చేస్తోంది. “లింగా, కబాలి” సినిమాలకు ఎంత పబ్లిసిటీ లభించిందో, అంత దారుణ పరాజయాలను చవిచూసాయి. అయితే ఆ రేంజ్ పబ్లిసిటీ కారణమవుతున్న అంశాలలో ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రధానంగా హల్చల్ చేస్తున్నాయి. రజనీ గత సినిమా ‘కబాలి’ ఫస్ట్ లుక్ పోస్టర్ సృష్టించిన హంగామా తెలియనిది కాదు. అలాగే తాజాగా అదే దర్శకుడు రంజిత్ “కాలా” ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయే రేంజ్ లోనే ఉంది.
కాలు మీద కాలేసుకుని జీబు పై కూర్చున్న సూపర్ స్టార్ పోస్టర్ చూస్తే ఫ్యాన్స్ కు కిక్ ఎక్కడం ఖాయం. అంతలా పోస్టర్ అభిమానులకు పిచ్చేక్కిస్తోంది. అయితే పోస్టర్లలో కనిపించిన దూకుడు, హంగామా ఇటీవల కాలంలో సూపర్ స్టార్ సినిమాలలో దూరమయ్యాయి. ఒకప్పుడు ఏదైతే రజనీని ‘సూపర్ స్టార్’గా నిలబెట్టాయో, ఇప్పుడు అవే అంశాలు దూరం అవుతుండడం అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తున్నాయి. అయితే ఈ “కాలా” సినిమా అయినా ఫ్యాన్స్ ఆశించే అంశాలతో వస్తుందని ఆశిద్దాం.
Humour, unusual characters, unexpected situations and conversations form the focus of the latest trailer of…
The Andhra Pradesh municipal election results have delivered several unexpected outcomes. Candidates who were confident…