
ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ సినిమా ఎలా ఉండబోతోంది? వయసు మళ్ళిన తర్వాత డాన్ పాత్రలో ఎలా మెరవబోతున్నాడు. పేరు లేని ఓ దర్శకుడు సూపర్ స్టార్ రేంజ్ ను తగిన విధంగా చూపించాడా? ఆకాశాన్ని తాకిన అంచనాలను ‘కబాలి’ అందుకుంటుందా? దీనిపై పూర్తి సమాచారం రావాలంటే మరికొద్ది గంటలు గడవాలి గానీ, ఈ లోపున సోషల్ మీడియాలో ‘కబాలి’ రివ్యూ అంటూ ఒకటి హల్చల్ చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఒక స్పెషల్ షో పడడంతో, ఆ షోను చూసిన వారు అందించిన రివ్యూగా ప్రచారం జరుగుతుంది.
‘కబాలి’ సినిమా కథ మలేషియా నేపథ్యంలో నడుస్తుందని, మలేషియాలో అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు, వారి బారి నుంచి తమను రక్షించే వ్యక్తి కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ వివక్షను ఎదురించి జైలు పాలై విడుదలైన ‘తలైవా’ అక్కడ సాధారణ మనిషిగా జీవిస్తాడు. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల కారణంగా కుమార్తెను రక్షించుకునేందుకు గ్యాంగ్ స్టర్ గా మారుతాడు. దీంతో అప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల పక్షాన నిలబడి… వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాడు. సింపుల్ గా ఇదీ ‘కబాలి’ కథగా ప్రచారం జరుగుతోంది.
ఈ కధ వింటుంటే రాజమౌళి – ప్రభాస్ ల ‘ఛత్రపతి’ సినిమా గుర్తుకు రావడం సహజమే. అయినా ‘కబాలి’ సినిమా మాత్రం రజనీకాంత్ అభిమానులను విశేషంగా అలరిస్తుందని, తన మేనరిజమ్స్ తో అభిమానులను రజనీ గిలిగింతలు పెడతాడని, కుర్రాడిగా రజనీకాంత్ చూపించిన దూకుడు ఫ్యాన్స్ ను అలరిస్తాడని అందించిన రివ్యూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే ఇదంతా ‘కబాలి’ మేనియాను దృష్టిలో పెట్టుకుని, రాసిన ఒక అభూతమైన వర్ణనగా ధృవీకరణ అయ్యింది.
‘కబాలి’ రివ్యూ పేరుతో విడుదలకు ముందే వస్తున్న ఇలాంటి ఫేక్ రివ్యూలు అభిమానులను, సినీ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘కబాలి’ రియల్ స్టోరీ తెలియాలన్నా, సూపర్ స్టార్ రియల్ స్టార్ డం గురించి తెలియాలన్నా మరికొద్ది గంటలు వేచిచూడక తప్పని పరిస్థితి.
Hero Sree Vishnu is coming up with a comedy entertainer Comrade Kalyan, directed by Janakiram…
Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…