
కడపలో ఉక్కు కర్మాగారం… రాష్ట్ర విభజన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు దీనికి బీజం వేశారు. ఈ రంగంలో అగ్రగామి సంస్థ జేఎస్‌బ్ల్యూతో మాట్లాడి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టించేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదన అటకెక్కిపోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరిగేలా చేస్తే కనీసం సొంత జిల్లాకు ఎంతో కొంత మేలు చేశారని చెప్పుకోవడానికి ఉండేది. దీని ఏర్పాటు కోసం ‘వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్’ని కూడా ఏర్పాటు చేశారు. రెండోసారి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇంతవరకు స్టీల్ ప్లాంట్ పునాది రాయి కూడా పడలేదు.
కనుక మళ్ళీ ఈ బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడుపైనే పడింది. ఆయన ముఖ్యమంత్రి కాగానే జేఎస్‌బ్ల్యూ యాజమాన్యంతో మాట్లాడి కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహాయసహకారాలు అందజేస్తామని చెప్పి ఒప్పించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్ళపల్లె, పెద్ద దండలూరు గ్రామాల మద్య దీనికోసం 1100 ఎకరాలు ‘వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్’ నుంచి బదిలీ చేయించారు. దీని కోసం ఆ సంస్థ రూ.55 కోట్లు ఏపీఐసిసికి చెల్లించింది.
జేఎస్‌బ్ల్యూ సంస్థ రెండు దశలలో మొత్తం రూ. 16,350 కోట్లు పెట్టుబడి పెడుతుంది. మొదటిదశలో రూ. 4500 కోట్లు పెట్టుబడితో ఏడాదికి 10 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని తప్పనిసరిగా 2029, ఏప్రిల్ నాటికి అంటే వచ్చే ఎన్నికలకు ముందు ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నాయుడు గడువు విధించారు. మొదటిదశలో 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 3-4,000 మందికి ఉపాధి లభిస్తుంది.
మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం కాగానే రెండో దశ నిర్మాణ పనులు మొదలుపెట్టాలి. దీని కోసం జేఎస్‌బ్ల్యూ సంస్థ రూ. 11,850 కోట్లు పెట్టుబడి పెడుతుంది. రెండో దశలో అదనంగా మరో 2 మిలియన్ టన్నులు ఉత్పత్తి జరుగుతుంది. ఈ రెండో దశ నిర్మాణ పనులు 2034, ఏప్రిల్ నాటికి పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. రెండో దశ ఉత్పత్తి మొదలైతే మరో 1,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ ప్లాంట్ ఏర్పాటుకి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కనుక ముందుగా జగన్, వైసీపీ నేతల ‘క్రెడిట్ చోరీ’ పాట ఆలపన కార్యక్రమం తప్పక ఉంటుంది. ముఖ్యంగా నాడు తాము ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్ కార్పోరేషన్’ పేరుని కూటమి ప్రభుత్వం మార్చకుండా అలాగే ఉంచడం వైసీపీ పాటకి బాగా పనికివస్తుంది.
కోలీవుడ్ హీరో విజయ్ టీవీకే పార్టీతో తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలుచుకున్నప్పుడు జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు, పార్టీలో..…
The much-anticipated director Buchi Babu Sana is set to release Peddi on June 4th.…