
పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి, ఇద్దరిని ఎంపిక చేసుకుని, ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపి, చివరికి చిక్కుల్లో పడి ఎవరిని పెళ్లి చేసుకుంది అనే కాన్సెప్ట్ తో “కాదలి” సినిమా తెరకెక్కిందని ట్రైలర్ స్పష్టం చేసేసింది. ఇక కధ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజానికి ఇదే తరహా కధ ఇటీవలే “నేను నా బాయ్ ఫ్రెండ్స్” రూపంలో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ముగ్గురు హీరోలు, ఒక హీరోయిన్ కాగా, ఇక్కడ ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్… అంతే తేడా..!
అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే… సాధారణంగా ఇలాంటి సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ హోరెత్తిపోతుంటాయి. కానీ అలాంటి వాటికి తావు లేకుండా, చక్కగా క్లాస్ టచ్ ఇస్తూ తెరకెక్కించడం అభినందించదగ్గ విషయం. అలాగే ప్రధాన పాత్రలకు ఎంపిక చేసుకున్న ముగ్గురు కూడా కొత్త వారే కాగా, హీరోయిన్ పూజా రూపం వీక్షకులకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. గతంలో చిరంజీవి, మహేష్ సినిమాలకు ఫోటోగ్రఫీ అందించిన శేఖర్ వి జోసెఫ్ ఫోటోగ్రఫీ నాణ్యత ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్.
A roulette wheel, a casino floor and a group of young people looking for a…
రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ కుటుంబ కంచుకోటగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న పులివెందులలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ…