
ఎన్టీఆర్ హయాంలో తెలుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన కడియం శ్రీహరి వరంగల్ టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తూ రాజకీయాలలో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకులలో ఒక సీనియర్ నేతగా గుర్తింపు పొందారు.
2013 తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంగా టీడీపీకి రాజీనామా చేసి తెరాస తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ కోటాలో తెలంగాణ డిప్యూటీ సీఎం గా విద్యా శాఖ మంత్రిగా పని చేసి తెరాస పార్టీలో కీలక నేతగా, కేసీఆర్ కు నమ్మదగ్గ నేస్తంగా మారిపోయారు.
అలాగే అధికార పక్షమైన బిఆర్ఎస్ నేతగా ఉన్న కడియం గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ నేతల మీద అనేకానేక విమర్శలు గుప్పిస్తూ తెరాస పార్టీకి వీర విధేయుడయ్యారు. అయితే 2023 తెలంగాణలో ఎన్నికలలో ఊహించని రీతిలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీ సీనియర్లు గా చెలామణి అయినా నేతలు పార్టీ జెండా మార్చేశారు.
గెలుపులో పదవులనుభవించిన కేకే, కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు కేసీఆర్ కారు దిగి రేవంత్ చేయనందుకున్నారు. అయితే తిరిగి సొంత గూటికి చేరిన కేశవరావు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో కేబినెట్ హోదాతో తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా వ్యవహారాల సలహాదారుగా పదవి దక్కించుకున్నారు.
కానీ కేసీఆర్ ను కాదనుకుని కాంగ్రెస్ చేయూత కోరిన కడియం శ్రీహరి ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలలో కనిపించడం లేదు. అయితే తన రాజకీయ వారసురాలిగా బిఆర్ఎస్ పార్టీ తరుపున వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయవల్సిన కడియం కావ్య కూడా
తండ్రి బాటలోనే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు.
కూతురు రాజకీయ అరంగేట్రంతో ప్రస్తుతానికి సైలెంట్ అయినా కడియం ఇకపైనా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నేతగా యాక్టీవ్ అవుతారా.? తన మాజీ అధినేత మీద ఘాటైన విమర్శలు గుప్పిస్తారా.? కాంగ్రెస్ పార్టీ కడియంకు అంత అవకాశం కల్పిస్తుందా.? అనేది వేచి చూడాలి.
పార్టీ మారిన ఫలితం దక్కలేదా అన్నట్టుగా తన మాజీ అధినేత కేసీఆర్ మాదిరి తెలంగాణ రాజకీయాలలో కడియం శ్రీహరి పేరు ఎక్కడ వినిపించడం లేదు, ఆయన జాడ ఎక్కడ కనిపించడం లేదు.దీనితో కడియం కారు దిగినా హస్తం తో కలవలేకపోతున్నారా అనే అభిప్రాయం వినిపడుతుంది.
Finally, Vijay Sethupathi's long-pending project Train directed by Mysskin has got its release date. Recently,…
Karan Johar has recently started planning another big film. Latest updates have revealed that the…