
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెడ్ గౌన్ వేసుకుని మెరిసిపోతున్న ఈ ‘చందమామ’ టెన్నిస్ అంటే తనకు చాలా ఇష్టమని, అందులోనూ వింబుల్డన్ కున్న చరిత్ర అమోఘమని, సాధారణంగా ఖాళీ సమయం దొరకదని, కానీ ఇక్కడ కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని వచ్చానని, అయితే వింబుల్డన్ కు రావడం ఇదే మొదటిసారని తెలిపింది. ఈ సందర్భంగా సదరు యాంకర్ వేసిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ తన అందచందాలను ప్రదర్శించింది ముద్దుగుమ్మ.
ఫెదరర్ – నాదల్ లలో ఫెదరర్ అంటే తనకు ఇష్టమని, సెరెనా – వీనస్ లలో సెరెనాకే తాను ఓటు వేస్తానని తెలిపిన కాజల్, క్రికెట్ – టెన్నిస్ లలో మాత్రం మొదటి ప్రాధాన్యత క్రికెట్ కే ఇస్తానని, వింబుల్డన్ లో ఉన్నప్పటికీ, తాను హానెస్ట్ గా చెప్పాలి కాబట్టి క్రికెట్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని, కానీ టెన్నిస్ కూడా ప్రేమిస్తానని, ముంబై – లండన్ లలో ముంబై అంటే ఇష్టమని తెలిపింది. ఇక సచిన్ టెండూల్కర్ – లియాండర్ పేస్ లలో తామందరికీ క్రికెట్ గాడ్ అయిన సచిన్ కే తన ఓటని చిరునవ్వులు చిందిస్తూ తన భావాలను పంచుకుంది.
Pakistan have made several changes to their Test team during the England series, and former…
Allari Naresh is ready to entertain audiences worldwide on September 4th with his upcoming socio-fantasy…