
మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’లో నటించి సూపర్ హిట్ అందుకున్న కాజల్ అగర్వాల్, ఈ ఏడాది ‘బ్రహ్మోత్సవం’లో నటించి అట్టర్ ఫ్లాప్ సొంతం చేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ కు మెగాస్టార్ సినిమానే చివరి అవకాశం అనుకుంటున్న తరుణంలో… మళ్ళీ ప్రిన్స్ మూవీ తలుపు తట్టిందన్న టాక్ హల్చల్ చేస్తోంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా భారీ నష్టాలను పూడ్చడంతో, వాటిని తీర్చేందుకు పివిపి బ్యానర్లో ప్రిన్స్ ఒక సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో మహేష్ పక్కన కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసారని, దర్శకనిర్మాతలు ఈ దిశగా ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వంశీ దర్శకత్వం వహించిన ‘బృందావనం, ఎవడు’ సినిమాలలో కాజల్ నటించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మతోనే ముందుకెళ్ళాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఏది ఏమైనా అధికారిక ప్రకటన మాత్రం వచ్చే ఏడాదిలోనే ఉండనుంది.
Did the failure of Alia Bhatt’s Alpha end up affecting other female actors too? Taapsee…
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…