
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రోనీని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రోనీ ఇంట్లో గంజాయి స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు వెనువెంటనే అరెస్ట్ చేసారు. గతంలో లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకు కూడా మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించిన ట్రాక్ రికార్డ్ రోనీ ఫ్లాష్ బ్యాక్ లో ఉంది. చాలా రోజులుగా డ్రగ్స్ వాడుతున్నాడని పోలీసులు ధృవీకరించుకున్న తర్వాత, రెడ్ హ్యాండెడ్ గా ఇంట్లోనే గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు పోలీసులు.
తాజా పరిణామాలతో డ్రగ్స్ కేసును పోలీసులు అంత తేలికగా తీసుకున్నట్లు కనపడడం లేదు. అయితే దీని వెనుక ఇంకా పెద్ద జాబితా ఉందన్న మీడియా వర్గాల కధనాలతో మున్ముందు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉంటే పోలీసుల ప్రతాపం చిన్న చిన్న వాళ్ళ మీదే గానీ, బిగ్ షాట్స్ జోలికి వెళ్ళరని, నిజంగా ఈ కేసులో అంత చిత్తశుద్ధి ఉంటే విచారణ విషయాలను ఎందుకు అధికారికం చేయడం లేదని వర్మ లాంటి వాళ్ళ ప్రశ్నలకు బలం చేకూరుతోంది. మొత్తానికి డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీతో పెనవేసుకుపోయినట్లుగా ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…