డిజిటల్ డెబ్యూకు సిద్దమైన కాజల్, తమన్నా

Kajal Aggarwal - Tamannaah Bhatia OTT Debutటాలీవుడ్ లోని పాపులర్ హీరోయిన్లు – కాజల్ అగర్వాల్, తమన్నా తమ డిజిటల్ డెబ్యూ కు సిద్ధం అవుతున్నారు. అయితే ఇద్దరు రెండు తమిళ వెబ్ సిరీస్ లతో తమ డిజిటల్ అరంగేట్రం చెయ్యడం విశేషం. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితం వచ్చింది. పాపులర్ ఓటీటీ మేజర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రెండు ప్రసారం కాబోతున్నాయి.

కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్ కు లైవ్ టెలికాస్ట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సిరీస్‌లో వైభవ్, ఆనందీ కూడా నటిస్తున్నారు. ఈ సిరీస్ ‘కుటుంబ ప్రేక్షకుల కోసం రూపొందించిన పూర్తి స్థాయి హర్రర్’ అని మేకర్స్ పేర్కొన్నారు. ప్రకటన చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నటి కృత్రిమ కళ్ళతో అద్భుతంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్ కోసం మెగాఫోన్‌ ను పట్టుకున్నారు. మరోవైపు… తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ పేరు నవంబర్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్‌ను రాట్సాసన్ ఫేమ్ రామ్ కుమార్ సహచరుడు రామ్ సుబ్రమణియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అతని డైరెక్షనల్ అరంగేట్రం. తమన్నా ఈ సిరీస్ లో తన క్రిమినల్ తండ్రి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నిస్తున్న కుమార్తెగా కనిపిస్తుంది.

తమిళ నటుడు జిఎం కుమార్ ఆమె తండ్రి పాత్రలో నటిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ రెండు సిరీస్ లకు సంబందించిన విడుదల తేదీలను ఇంకా ప్రకటించలేదు. వీరికి ఉన్న పాపులారిటీని బట్టి వేరే భాషలలోకి డబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దానికి సంబంధించిన ప్రకటన కూడా చెయ్యలేదు.

ADVERTISEMENT
Latest Stories