
పశ్చిమబెంగాల్‌లో ఓ కథ ఇప్పుడు నేషనల్ టాక్ అయింది. ఒకప్పుడు ఇళ్లలో పనిమనిషిగా పని చేసిన మహిళ… ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇది సింపుల్ విజయం కాదు, సిస్టమ్‌పై ఓ స్టేట్మెంట్.
కలితా మాఝీ పేరు ఇప్పుడు అందరికీ తెలిసింది. ఔస్‌గ్రామ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి, టీఎంసీ అభ్యర్థిపై 12,500కు పైగా ఓట్ల తేడాతో గెలవడం చిన్న విషయం కాదు. 1 లక్షకు పైగా ఓట్లు సాధించడం అంటే గ్రౌండ్‌లో ఆమెకు ఉన్న కనెక్ట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థమవుతోంది.
ఈ విజయం ఒక్కరోజులో రాలేదు. నెలకు రూ.2,500 సంపాదించే పనిమనిషి నుంచి రాజకీయాల్లోకి రావడం అంటే పెద్ద జంప్. 2021లో ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు, అదే పెద్ద ట్విస్ట్.
ఓడిపోయిన తర్వాత చాలా మంది కనిపించకుండా పోతారు. కానీ కలితా మాత్రం ప్రాంతంలోనే ఉండి, ప్రజలతో కనెక్షన్ పెంచుకుంది. ఈసారి అదే కనెక్షన్ ఓట్లుగా మారింది.
ఇక్కడ అసలు పాయింట్ ఇంకొకటి. ఇది కేవలం కలితా గెలుపు కాదు, BJP తీసుకున్న స్ట్రాటజీ కూడా వర్క్ అయిందనే సిగ్నల్. గ్రాస్‌రూట్ ఫేస్‌ను ముందుకు తేవడం ఎలా రిజల్ట్ ఇస్తుందో ఈ ఫలితం చూపించింది.
మరోవైపు TMC కి ఇది క్లియర్ వార్నింగ్. 15 ఏళ్ల పవర్ తర్వాత వచ్చిన అలసట, అసంతృప్తి ఇలా గ్రౌండ్ లెవెల్‌లో బయటపడింది.
ఇలాంటి స్టోరీలు ఎమోషన్‌గా వినిపిస్తాయి. కానీ ఇందులో పొలిటికల్ మెసేజ్ చాలా క్లియర్. ప్రజలు ఇప్పుడు పెద్ద పేర్లు కాదు, దగ్గరలో కనిపించే వాళ్లను ఎంచుకుంటున్నారు.
మొత్తానికి కలితా విజయం ఒక లైన్ చెబుతోంది. అవకాశాలు ఉన్నాయ్… కానీ వాటిని పట్టుకునే పట్టుదల ఉంటేనే ఫలితం. ఈ గెలుపు ఒక్క వ్యక్తి కథ కాదు, మారుతున్న రాజకీయాల మూడ్.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…