
తెలంగాణ రాజకీయాలలో అనుకోని సంఘటన…బిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్…కేసీఆర్ కు మరో ఎదురుదెబ్బ…ఇలా ఎన్ని చెప్పుకున్న అవి తక్కువే అనేలా కేసీఆర్ కుమార్తె బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసారు ఈడీ అధికారులు.
ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్ తో వచ్చిన పలువురు అధికారులు సుమారు కొన్ని గంటల పాటు కవిత నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వారికి అవసరమైన వస్తువులను, కొన్ని డాక్యూమెంట్లను సీజ్ చేసారు.
కవిత అరెస్టు కాబోతున్నారు అంటూ ప్రచారం జరగడంతో ఆ పార్టీ కార్యకర్తలు కవిత అనుచరులు కేంద్ర ప్రభుత్వానికి, ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ల పై బైఠాయించారు. దీనితో కవిత అడ్వాకెట్ సోమా భారత్ దాని పై స్పందించారు. ఇటువంటి ఊహాగానాలకు తావు లేదు కవిత అరెస్టు అయ్యే అవకాశం లేదంటూ పార్టీ క్యాడర్కు, కవిత అనుచరులకు నచ్చచెప్పినా కొద్దీ సేపటిలోనే కవిత అరెస్టు కావడం ఆ పార్టీ శ్రేణులకు ఊహించని షాక్ తగిలింది.
అసెంబ్లీ ఎన్నికలో ఓటమి, పార్టీ అధినేత కు అనుకోని ప్రమాదం జరగడం, మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ఒక్కొకరుగా పార్టీని వీడడం…,ఇప్పుడు కవిత అరెస్టు ఇలా బిఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. కవితను ఈడీ అరెస్టు చేసిందనే సమాచారంతో ఆమె నివాసానికి చేరుకున్నారు కేటీఆర్, హరీష్ రావు. లిక్కర్ కేసులో ఇన్నాళ్ల నుంచి విచారణకు హాజరుకాకుండా కోర్టుల చుట్టూ తిరిగిన కవితకు చివరి అరెస్టు తప్పలేదు.
అలాగే మాకు కనీస సమాచారం ఇవ్వకుండా, వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు అంటూ ఆమె న్యాయవాది ఈడీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో కవితను అరెస్టు చేయడం చట్ట విరుద్ధం అంటూ దీనిపై న్యాయపోరాటానికి సిద్ధం అంటూ కవిత న్యాయవాది భారత్ తెలిపారు. కవిత అరెస్టు పై ఆమె అన్న కేటీఆర్ ట్రాన్సిట్ వారెంట్ కూడా లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక పక్క పార్టీ అధినాయకత్వం, మరో పక్క పార్టీ కార్యకర్తలు ఒకకొక్కరుగా అక్కడికి చేరుకోవడంతో అసలు అక్కడ ఎం జరగబోతుంది అనే ఉత్కంఠ నెల్లకొంది. ఈ నేపథ్యంలో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఈ రోజు రాత్రికి ఆమెను ఫ్లయిట్ లో ఢిల్లీ తరలించే ఆలోచనలో ఉన్నారు.
తెలుగు రాష్టాలలో ముఖ్యమంత్రుల, మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి రాజకీయాలలోకి వచ్చిన మహిళల పైన ఇటువంటి ఆరోపణలు రావడం…అరెస్టు కావడం ఇదే ప్రధమంగా చెప్పవచ్చు. ఇందులో కవితదే మొదటి స్థానంగా చెప్పవచ్చు.
ఇలా చెల్లి కవిత మీద వచ్చిన ఆరోపణలకు, ఆమె అరెస్టు కు వ్యతిరేకంగా అధికారులతో వాగ్వాదానికి దిగి ఆందోళన చెందుతున్న అన్న కేటీఆర్ ఒక పక్క…చెల్లెలు షర్మిల మీద ఆరోపణలు చేస్తూ అధికారులను అడ్డుపెట్టుకుని అరెస్టు చేపించే అన్న జగన్ మరో వైపు. ఇలా తెలుగు రాష్ట్రాలలో జరిగితున్న అన్నా – చెల్లాల పంచాయితీ కూడా తెలుగు ప్రజలను ఆలోచింపచేస్తుంది.
The CBI and ED are tightening their investigations into several high-profile cases linked to Andhra…
BOTTOM LINE Promising Start, Loses Steam RATING 2.5/5 Story, Screenplay, Director: Nelson Dilip Kumar Cast:…