
గత నెల 15 న ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులో తనకు ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిలు కావాలంటూ కోర్ట్ ను ఆశ్రయించారు కవిత.
దీని పై విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ అవెన్యూ న్యాయస్థానం కవిత అభ్యర్థనను తిరస్కరించింది. కాగా కవిత రెగ్యులర్ బెయిల్ విచారణ ఈ నెల 20 న జరగనున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏంటి అనే సందేహంలో ఉన్నారు కవిత కుటుంబ సభ్యులు. ఏ కేసులో ఆరోపణలు ఎదుర్కొని నిందితులుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారు కొందరైతే, అప్రూవల్ గా మారి న్యాయస్థానాలకు సహకరిస్తాం అంటూ బెయిలు మీద బయటకు వచ్చినవారు కొందరు.
ఇటువంటి తరుణంలో కవిత కేసులో కూడా ఇప్పటికిప్పుడే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆశించే మార్పులేమీ చోటుచేసుకోకపోవచ్చు అంటూ పోలిటల్ సర్కిల్స్ లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత బెయిలు మీద బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ ఈడీ అధికారులు తమ వాదనను వినిపించడంతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత బెయిలు అభ్యర్థనను తిరస్కరించింది.
అయితే రేపటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో ఈడీ అధికారులు కూడా తదుపరి కార్యచరణకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇలా కవితకు బెయిలు రాకపోవడంతో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో అటు కవిత కుటుంబసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నేతలు….జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో నెక్స్ట్ ఏంటి అంటూ ఇటు ఈడీ అధికారులు….ఎవరి ఆలోచనలకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…