
కేసీఆర్ మహా రాజకీయ మేధావిననుకుంటే తండ్రిని మించిన మేధావినని ఆయన కూతురు కల్వకుంట్ల కవిత నిరూపిస్తున్నారు.
‘బిఆర్ఎస్ పార్టీ కలకాలం నిలిచి ఉండాలి. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఆయన నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందగలదని’ చెపుతూనే, బిఆర్ఎస్ పార్టీని తన తండ్రి బీజేపిలో విలీనం చేయాలని ఆరాటపడుతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు.
పార్టీ కోసమే నా తాపత్రయం అంటూనే పదేపదే ఈవిదంగా బహిరంగగా ‘బీజేపిలో బిఆర్ఎస్ విలీనం’ అంటూ మాట్లాడుతుండటం ద్వారా తానే పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తున్నానని కల్వకుంట్ల కవితకి తెలియదనుకోలేము.
అంటే తాను పార్టీని వీడినా, పార్టీ నుంచి సస్పెండ్ చేయబడినా అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని అర్దమవుతోంది.
‘ఓ పక్క నేను బిఆర్ఎస్ పార్టీని వీడటం లేదు. కొత్త పార్టీ పెట్టడం లేదు,’ అని చెపుతూనే తన ‘తెలంగాణ జాగృతి’ జాగృతం చేస్తున్నారు.
ఆ జాగృత సమావేశాలలో గులాబీ కండువాలు, బిఆర్ఎస్ నేతలు కనపడటం లేదు. చివరికి కేటీఆర్ బొమ్మ కూడా కనబడటం లేదు!
పార్టీని వీడదలుచుకోనప్పుడు అకస్మాత్తుగా జాగృతం కావలసిన అవసరం ఏమిటి? అని ఆలోచిస్తే వీడితే సిద్దంగా ఉండాలి కదా అందుకే ఈ హడావుడి.. ఏర్పాట్లు అని అనుకోక తప్పదు.
మరో విశేషమేమిటంటే తన తండ్రి పట్ల బిఆర్ఎస్ పార్టీలో ఎవరికీ శ్రద్ధ లేదని ఆరోపిస్తున్న ఆమె, కాళేశ్వరం కేసులో తన తండ్రికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4, బుధవారం హైదరాబాద్, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయబోతున్నారు.. ఆఫ్ కోర్స్.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే!
కేసీఆర్, పార్టీ విధానాలను తప్పు పడుతూ, పార్టీకి నష్టం కలిగేలా బహిరంగంగా మాట్లాడుతూ, తండ్రి కోసం అంటూ కల్వకుంట్ల కవిత ధర్నా చేస్తుండటం.. అదీ.. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తుండటాన్ని ఏవిదంగా భావించాలో తెలియక బిఆర్ఎస్ నేతలు తికమకపడుతున్నారు.
ఇదివరకు వైఎస్ షర్మిల తండ్రి వైఎస్ పేరు చెప్పుకుంటూ తెలంగాణలో బలం కూడగట్టుకొని రాజకీయాలు చేశారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా అచ్చం ఆదేవిదంగా తండ్రి కేసీఆర్ పేరుతో రాజకీయాలు మొదలుపెట్టారు! బిఆర్ఎస్ పార్టీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్నవారిని జాగృతిలోకి ఆకర్షించేందుకేనేమో?
ఈవిదంగా రోజుకో సినిమా చూపిస్తున్నా తండ్రి కేసీఆర్ మౌనంగా ఉండిపోవడంతో కల్వకుంట్ల కవిత సహనం కోల్పోతున్నారు. అందుకే కార్యాచరణ వేగవంతం చేశారనుకోవచ్చు. ఈ ఫ్యామిలీ డ్రామాలో తమ పాత్రలు ఏమిటో తెలియక బిఆర్ఎస్ శ్రేణులు తమ దేవుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. మరి దేవుడు ఎప్పుడు నోరు విప్పుతారో ఎప్పుడు ఏ ఆజ్ఞ జారీ చేస్తారో?
BOTTOM LINE Outdated Comedy, Comrade RATING 1.75/5 Story, Screenplay,Director: Janakiram Marella Cast: Sree Vishnu, Mahima…
BOTTOM LINE Novel Thriller, Slightly Overstuffed PLATFORM SonyLIV RUNTIME 6 Hours [7 Episodes] What Is…