
కేసీఆర్ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్చుకున్నప్పుడు ఆమె కూడా తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మార్చుకున్నారు. కానీ పేరు మార్చుకున్నా తండ్రీ కూతుర్లు కంటెంట్ మార్చుకోలేదు. కనుక వారి జాతీయవాదం, జాతీయస్పూర్తి మాటలకే పరిమితం చేసి ప్రాంతీయవాదంతోనే వారు, వారి పార్టీలు ముందుకు సాగుతున్నాయి.
కనుక కల్వకుంట్ల కవిత ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ మద్యలో ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆ మాటకొస్తే ఆమె సిఎం చంద్రబాబు నాయుడుని కూడా విడిచిపెట్టరు. అవకాశం దొరికినప్పుడల్లా ఎద్దేవా చేస్తూనే ఉంటారు. తనని, తన తండ్రిని అందరూ గౌరవించాలని కోరుకుంటునప్పుడు, తెలంగాణవాళ్ళు సంస్కారవంతులని గొప్పగా చెప్పుకుంటునప్పుడు తన తండ్రి కంటే వయసులో, అనుభవంలో కూడా పెద్దవారైన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గురించి ఆమె అంత చులకనగా ఎలా మాట్లాడుతారో ఆమెకే తెలియాలి.
కరడుగట్టిన ప్రాంతీయవాదంతోనే తన రాజకీయ భవిష్యత్‌ని తీర్చిదిద్దుకోవాలనుకుంటున్న ఆమె, ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌కి హాజరైనప్పుడు “మన రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా మనల్ని కలిపేది ఈ సినిమాలే. మనం మనం కొట్లాడుకుంటుంటే బయటున్నవాడొచ్చి మనల్ని కొడతాడు. కనుక మనం పరస్పరం గౌరవించుకుంటూ, మన తెలుగు భాషని, తెలుగు సినీ పరిశ్రమని కాపాడుకోవాలి,” అన్నారు కల్వకుంట్ల కవిత.
ఆమె నోట ఇలాంటి మాటలు విన్నావారు బహుశః ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఆమె ఏదో సందర్భానుసారం ఈవిధంగా మాట్లాడారా? లేక బీఆర్ఎస్ పార్టీ లాగే తమకి దూరంగా ఉండిపోయిన ఏపీలో వైసీపీకి సపోర్ట్ ఆశిస్తూ ఇలా మాట్లాడారా? అనే సందేహం కలుగుతుంది.
తెలుగు భాషను కాపాడుకోవాలి!
రాష్ట్రాలుగా విడిపోయినా… మనం మాత్రం కలిసే ఉండాలి.
“తాలుకా” అనే పదాన్ని మేం తెలంగాణలో వాడం. Venkatramaiah Gari Taluka మూవీ ఈవెంట్ లో కవిత. pic.twitter.com/G42y8K1FDg
— M9 NEWS (@M9News_) July 13, 2026
YouTuber Nandana has reportedly appeared before the police in connection with the financial fraud case…
Suriya and Jyothika have completed 20 years of marriage. Instead of just celebrating a wedding…