
ఈ నెల 27న హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుపుకోబోతోంది. కనుక బిఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సభలు-సమావేశాలు నిర్వహిస్తూ తమ సభకి జనాలను రప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్, కల్వకుంట్ల కవిత వంటివారు పదేపదే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ భజన చేస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
వారి పార్టీ మనుగడకు ఎలాగూ చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించుకుంటారు. కానీ కేసీఆర్ పాల్గొనబోయే ఈ సభకు కూడా చంద్రబాబు నాయుడి భజన చేస్తుండటం చూసి టీడీపీ నేతలు, ఆంధ్రా ప్రజలు నవ్వుకోకుండా ఉండగలరా?
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సింగరేణి ప్రాంతంలో సన్నాహక సభలో మాట్లాడుతూ, “సమైక్య రాష్ట్రంలో సుమారు 160-170 రాజకీయ పార్టీలు వచ్చాయి.. పోయాయి. వాటిలో నిలద్రొక్కుకున్నవి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ.. అక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రమే.
బిఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు పూర్తి చేసుకోగా, టీడీపీ 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగినందునే రెండు పార్టీలు ఇంతకాలం మనుగడ సాగించగలుగుతున్నాయి. ఇదేమీ సామాన్యమైన విషయం కాదు,” అని అన్నారు.
కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమాలు మొదలుపెట్టాలనే ఆలోచనే బిఆర్ఎస్ పార్టీకి బలమైన పునాది వేసిందని చెప్పొచ్చు.
ఆ తర్వాత ‘తెలంగాణ సెంటిమెంట్’ పేరుతో నిత్యం ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తూ, చంద్రబాబు నాయుడుని, మోడీని, కాంగ్రెస్, బీజేపిలను బూచిగా చూపిస్తూనే బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది తప్ప తమ సిద్దాంతాలు, విధానాలతో ముందుకు సాగలేకపోతోంది.
చంద్రబాబు నాయుడుపై ద్వేషం, అసూయలని జగన్ ఏవిదంగా వైసీపీ విధానంగా మార్చుకున్నారో కేసీఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్‌నే పార్టీ సిద్దాంతంగా మార్చేసుకొని, తమని వ్యతిరేకించేవారందరూ తెలంగాణ వ్యతిరేకిస్తున్నవారే అని ప్రజలని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో ‘తెలంగాణ సెంటిమెంట్’ బలంగా ఉన్నప్పుడు, ఆంధ్రాలో కూడా ఆంధ్రా సెంటిమెంట్ ఉండాలి కదా? కానీ కనీసం కనిపించదు.. ఎందుకు?అంటే జగన్, చంద్రబాబు నాయుడు ఎంచుకున్న విధానాలే కారణమని చెప్పొచ్చు.
చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే వైసీపీ సిద్దాంతంగా మార్చుకున్నందున, జగన్ ఎప్పుడూ ఆంధ్రా ప్రజలను ఆ దిశలోనే నడిపించాలని ప్రయత్నిస్తుంటారు.
సిఎం చంద్రబాబు నాయుడు ఎంతసేపు రాష్ట్రాభివృద్ధి, సమర్ధమైన పాలన, పరిశ్రమలు, టెక్నాలజీ గురించే ఆలోచిస్తుంటారు కనుక ప్రజలను కూడా ఆ దిశలోనే ఆలోచింపజేస్తుంటారు. కనుక ఆంధ్రాలో ఆంధ్రా సెంటిమెంట్ ఏర్పడే అవకాశమే లేదు. ఏపీకి ఆ అవసరం లేదు కూడా.
కానీ బిఆర్ఎస్ పార్టీ మనుగడకు తెలంగాణ సెంటిమెంట్, చంద్రబాబు నాయుడు చాలా కీలకం. కనుక వాటితో ముందుకు సాగాల్సిందే!
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…