
“తోటకూర దొంగిలించినప్పుడే మందలించి ఉంటే….” అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. అదిప్పుడు కల్వకుంట్ల కవితకు వర్తిస్తుందని ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభిప్రాయ పడ్డారు.
“ఆనాడు కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడే నాకు బీఆర్ఎస్ పార్టీపై విరక్తి కలిగింది. ఓ మాజీ ముఖ్యమంత్రి కూతురు అవినీతి కేసులో జైలుకి వెళ్ళినప్పుడు, ఇటువంటి పార్టీలో ఉండటం అవసరమా? అని నాకు అనిపించింది. నేను బీఆర్ఎస్ పార్టీని వీడటానికి ఇదీ ఓ కారణమే,” అని అన్నారు.
ఆనాడే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండాల్సింది కానీ ఆమె కేసీఆర్ కూతురు కనుక ఆమెకు పార్టీ అండగా నిలబడింది. అదే వేరొకరైతే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసేవారే కదా?అని కడియం శ్రీహరి అభిప్రాయం అక్షరాల నిజమే.
కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు దళితుడైన రాజయ్యపై అవినీతి ఆరోపణలు రాగానే ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పదవులు పీకేశారు.
తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌కి కుడి భుజంలా నిలబడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ని కూడా అసైన్డ్ భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకు బయటకు గెంటేశారు.
కేవలం ఆరోపణలు వస్తేనే కేసు, విచారణ ఏదీ లేకుండానే పదవులు పీకేసి బయటకు వెళ్ళగొట్టిన కేసీఆర్, కూతురు కవిత లిక్కర్ కేసులో తిహార్ జైలుకి వెళ్ళినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
అలాగే ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు కొడుకుపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
పైగా కొడుకు, కూతురుపై కేసులను ‘రాజకీయ కక్ష సాధింపు పద్దు’లో చేర్చేశారు. అంతే కాదు… కూతురుని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు కూడా సిద్దపడ్డారు కూడా!
కానీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు పార్టీకి, కేసీఆర్ ప్రతిష్టకి తీరని అప్రదిష్టం, మరింత నష్టం కలిగించిన తర్వాత విధిలేని పరిస్థితిలో ఆమెను సస్పెండ్ చేశారు.
తద్వారా కేసీఆర్ ఒక సమస్యని పరిష్కరించబోయి మరిన్ని కొత్త సమస్యలు, మరింత అప్రదిష్ట మూటగట్టుకున్నారు కదా?ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీ రాజకీయ నాయకుడు ఈవిదంగా వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకున్నారు కదా?
కానీ కేసీఆర్ స్వయంగా ఇప్పుడు అవినీతి కేసులలో చిక్కుకున్నాక కడియం శ్రీహరి చెప్పినట్లు గులాబీ పార్టీకి విశ్వసనీయత ఏముంటుంది? ఒకవేళ ఉన్నా ఇప్పుడు నష్ట నివారణ సాధ్యమా?
October marks the beginning of the US federal fiscal year. The reset may restore the…
One more day has passed in Bigg Boss, and one more day of Thrigun back-pitching…