
[m9ad]
‘2.0’ సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రకు గానూ తొలుత హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ ను అనుకున్నామని, ఆ తర్వాత కమల్ హాసన్ ను కూడా సంప్రదించామని, కానీ ‘భారతీయుడు 2’ చేయడానికి కనపరిచిన ఆసక్తి, ఈ ‘2.0’పై ప్రదర్శించకపోవడంతో, తదుపరి ప్రత్యామ్నాయంగా అక్షయ్ ను సంప్రదించామని దర్శకుడు శంకర్ తాజాగా చెప్పుకొచ్చారు.
ఒకవేళ కమల్ ‘ఓకే’ అనుంటే, తమిళ సినీ ప్రేక్షకుల కల సాకారం అయ్యుండేది. అంతేగాక ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ కూడా వచ్చి ఉండేది. అయితే బాలీవుడ్ మార్కెట్ దృష్ట్యా అయితే అక్షయ్ కుమార్ సరైన ఎంపికే అయినప్పటికీ, రజనీ – కమల్ కలయికను ఊహించుకునే సినీ ప్రేక్షకులకు మాత్రం ‘అరెరే సువర్ణవకాశం చేజారిపోయిందే’ అనిపించక మానదు.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…