
అయితే సినిమా మాత్రం విడుదల కాలేదు.దీంతో కమల్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదలపై ఎదురు చూపులు చూస్తున్నారు. గత రెండేళ్ళుగా అనేక మార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ‘విశ్వరూపం 2’ విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లుగా సినీ వర్గాల టాక్. తమిళులు అత్యంత ప్రియంగా ఇష్టపడే దీపావళి (అమావాస్య) నాడు విడుదల చేయాలని భావిస్తున్నారట.
మరి ఈ సారైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో గానీ, ‘విశ్వరూపం 2’పై కమల్ అభిమానులు, సినీ ప్రేక్షకులు అంచనాలనే పెట్టుకున్నారు. ‘విశ్వరూపం’లో టెర్రరిజంపై కమల్ చూపించిన విధానం, ఈ తదుపరి పార్ట్ పై మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా సినిమా చివరలో నెక్స్ట్ ఇండియాలోనే… అంటూ ముగించడంతో, కమల్ ఏ రేంజ్ లో తెరకేక్కించారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఆంధ్రా రాజకీయాలలో వైసీపీ ప్రవేశించనంత వరకు ఒక లెక్క... ఆ తర్వాత నుంచి మరో లెక్క అన్నట్లు పరిస్థితులు మారాయి.…
Keerthy Suresh kept her relationship with Antony Thattil away from the public eye for nearly…