
YS Jagan and YSRCP Face Criticism Over Political Strategy
ఆంధ్రా రాజకీయాలలో వైసీపీ ప్రవేశించనంత వరకు ఒక లెక్క… ఆ తర్వాత నుంచి మరో లెక్క అన్నట్లు పరిస్థితులు మారాయి. ప్రజా సమస్యలపై పోరాడుతూ రాజకీయాలు చేస్తూ జనాదరణ పొంది అధికారంలోకి రావడం అందరూ హర్షిస్తారు.
కానీ నాడు తండ్రి చనిపోగానే ‘ఓదార్పు యాత్ర’ మొదలు, రాజధాని అమరావతిని దెబ్బ తీసి, భూములు ఇచ్చిన రైతులను వేధించడం, పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల మూయించడం వరకు అన్నీ వింత పోకడలే.
ప్రజలు ఏమి ఆశించి తనను ముఖ్యమంత్రిని చేశారో గ్రహించకుండా, తన ఆలోచనలు, వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు, టీడీపీ నేతలపై కక్ష సాధింపులతోనే పుణ్య కాలం గడిపేశారు.
జగన్ ధోరణి చూసి ఆయనను ఎన్నుకున్న ప్రజలే గద్దె దించేసి రాష్ట్రాన్ని సరిచేసే బాధ్యత మళ్ళీ చంద్రబాబు నాయుడుకే అప్పగించారు.
సాధారణంగా ఇలాంటి పెద్ద ఎదురుదెబ్బ తిన్నప్పుడు ఎంతటివారైనా దానిని గుణపాఠంగా స్వీకరించి, తప్పులు, లోపాలు సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి వారి అభిమానం పొందేందుకు ప్రయత్నిస్తారు.
కానీ వైసీపీ అధినేత జగన్ ధోరణిలో ఏ మాత్రం మార్పు కలగకపోగా, ‘రప్పారప్పా’లతో ప్రజలను, అధికారులను, టీడీపి నేతలను, ఓటర్లను భయపెడుతూనే ఉన్నారు. మేము ఇలాగే ఉంటాం.. కానీ మీరు ‘జగన్ 2.0’కి సిద్ధం కావాల్సిందే అంటున్నారు.
ఇలాంటి బెదిరింపు ధోరణి కారణంగానే ‘మున్సిపోల్స్’లో వైసీపీని ప్రజలు మరోసారి తిరస్కరించారు. వైసీపీ ఘోర పరాజయం పాలైంది.
అయినా నేడు జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌లో వైసీపీ మళ్ళీ అదే రీతిగా వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
వైసీపీ రాజకీయాలు ఇలాగే ఉంటాయని స్పష్టమైంది. అలాగే వైసీపీ వ్యూహాలలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం కూడా భాగమేనని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటూనే ఉంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ‘ఎక్స్’ ఖాతాలో పెట్టిన ఈ పోస్ట్ ఇందుకు మరో నిదర్శనం. పశ్చిమ బెంగాల్ ఆక్వా సంస్థ నీటిని తోడిపోస్తున్న పంపులను ఫోటోలను పెట్టి, అమరావతిలో నీళ్ళు తోడిపోస్తున్నారంటూ దుష్ప్రచారం చేశారు. దీనిని ‘ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్’ విభాగం వెంటనే ఖండిస్తూ వాస్తవాన్ని వివరించింది.
అమరావతిలో కురిసిన వర్షాలకు నీటిని బయటకు తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ఎక్స్ (@KethireddyMLA) ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ ప్రచారం చేశారు.
ఈ ప్రచారం పూర్తిగా అసత్యం మరియు తప్పుదోవ పట్టించేలా ఉంది. పోస్టులో ఉపయోగించిన వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి సంబంధించింది కాదు. రెండవ స్క్రీన్‌షాట్‌లో బెంగాలీ భాషా శీర్షిక ("একযোগে চালানো হচ্ছে অনেকগুলা মেশিন" – Arif Hossain 5.0 ఖాతా) స్పష్టంగా కనిపిస్తోంది. ఇది బంగ్లాదేశ్ ప్రాంతంలో ఆక్వాకల్చర్, వ్యవసాయం లేదా నీటి నిర్వహణకు సంబంధించిన పాత దృశ్యం.
ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డ్రైనేజీలు, డక్టింగ్ కోసం తవ్విన గోతులు, రైతుల ప్లాట్ల కోసం నిర్మిస్తున్న రోడ్లు మరియు డ్రెయిన్ పనుల కారణంగా భారీ వర్షాలు పడినప్పుడు కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడం సహజం. ఇటీవల సంభవించిన అర్నబ్ మరియు మురసు తుఫాన్ల వల్ల కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు నిజా నిజాలు పరిశీలించకుండా వేరే ప్రాంతాల వీడియోలతో రాష్ట్ర రాజధానిపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, వేరే ప్రాంతపు దృశ్యాలను రాజధానికి ఆపాదిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం బాధ్యతారాహిత్యం. వేరే ప్రాంతానికి చెందిన బెంగాలీ వీడియో ఆధారంగా అమరావతి రాజధాని నిర్మాణాలు మరియు నీటి ఉపసంహరణపై చేసిన ఈ ప్రచారం పూర్తిగా అసత్యం.
ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.
#Factcheck
#AndhraPradesh— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) November 4, 2026
Keerthy Suresh kept her relationship with Antony Thattil away from the public eye for nearly…
The Supreme Court on Thursday, November 5, dismissed a petition seeking to transfer the Tirumala…