Telugu

నమ్మాలి… ‘సింగిల్ టేక్’లో సినిమా మొత్తం ఫినిష్..!

నిముషాల పాటను చిత్రీకరించడానికి సాధారణంగా సినిమాలలో ఎన్ని షాట్లు వినియోగిస్తారు? హీరోల కళ్ళజోడు దగ్గర నుండి హీరోయిన్ నాభి సౌందర్యం చూపించే వరకు ఒక వంద షాట్స్ ఒక్క 5 నిముషాల పాటలోనే చూడవచ్చు. మరి 150 నిముషాల సినిమా నిడివిలో ఎన్ని షాట్స్ చిత్రీకరిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. అయితే తాజాగా ‘సింగిల్ టేక్’లో పూర్తయిన 92 నిముషాల నిడివి గల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సాల్మన్ కే జార్జ్ అనే కన్నడ దర్శకుడు “కందా” సినిమా పేరుతో ఓ హర్రర్ మూవీని రూపొందించాడు. ఈ సినిమాకు కేవలం సింగిల్ టేక్ లో 92 నిముషాలలో పూర్తి చేసాడు. ఓ పాప చుట్టూ తిరిగే కధాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ ను బెంగుళూరులోని కేఆర్ పురంలో గల బెంగుళూరు మూవీస్ స్టూడియోలో చిత్రీకరించారు. టైటిల్స్ తో కలిపి 97 నిముషాల పాటు ఉండే ఈ సినిమాను సోనీ ఎఫ్ ఎస్ 7 కెమెరాతో షూట్ చేసారు. సినిమా తీయడానికి గంటన్నర్ర పాటు సమయమే అయినప్పటికీ, పర్ఫెక్షన్ కోసం 25 రోజుల పాటు రిహార్సల్స్ చేసామని స్పష్టం చేసాడు సాల్మన్.

ADVERTISEMENT

ప్రముఖ దర్శకదిగ్గజం కె.బాలచందర్ దగ్గర పని చేసిన ఈ దర్శకుడు రూపొందించిన ఈ ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఎందుకంటే… సింగిల్ షాట్ అంటూ వర్మ “ఐస్ క్రీం” సినిమాలో షూట్ చేసిన దాదాపు 5 నిముషాల వీడియోకే ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. దీంతో ఈ సింగిల్ టేక్ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బహుశా తెలుగులోకి కూడా అనువాదం అవుతుందేమో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా రివ్యూ: దేవకన్యలు సైతం కాపాడలేకపోయారు!

చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…

6 minutes ago

OTT Deal: The Key to Vishwambhara’s Release

Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…

31 minutes ago