
దీంతో గుంటూరులో బిజెపి సగం ఖాళీ అయిపోగా, టిడిపి బలం ఆమేరకు పెరిగింది. కన్నా లక్ష్మినారాయణ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2004 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బిజెపి నుంచి మరికొంతమంది సీనియర్ నేతలు టిడిపిలోకి తీసుకువస్తానని కన్నా లక్ష్మినారాయణ చెపుతున్నారు. కనుక ఆయన చేరికతో టిడిపి మరింత బలపడిందనే చెప్పొచ్చు.
అయితే గుంటూరు తన అడ్డా అని భావిస్తున్న టిడిపి ఎంపీ రాయపాటి సాంభాశివరావు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే వచ్చే ఎన్నికలలో గుంటూరుని వైసీపీ టచ్ చేయలేదు. ఇక అమరావతి రైతులని దారుణంగా అవమానించి, రాజధానిని విశాఖకి తరలించడానికి ప్రయత్నిస్తున్నందున గుంటూరుతో పాటు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అలాగే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తాహమని మభ్యపెడుతూ విశాఖ ఒక్కటే రాజధాని అనే విషయం బయటపెట్టినందుకు రాయలసీమ ప్రజలు సైతం వైసీపీపై ఆగ్రహంగానే ఉన్నారనే విషయం ఇదివరకు చంద్రబాబు నాయుడు పర్యటనలలో, ఇప్పుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో స్పష్టంగా కనబడుతోంది. కనుక టిడిపికి అన్నీ శుభసూచకాలు కనిపిస్తున్నట్లే భావించవచ్చు.
—
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…