
అయితే సదరు యువతి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, దీంతో ఫినాయిల్ తాగి ఈ హంగామా చేసాడు వెంకట్. మరో పక్క మొదటి నుంచీ విపరీతమైన ప్రచారం యావ కలిగిన హుచ్చ వెంకట్ ఈ ఘటనను కూడా తన ప్రచారానికి వాడుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల క్రితం హుచ్చ వెంకట్ నటించిన ‘పోకిరీ’ చిత్రం శాండిల్ వుడ్ లో అట్టర్ ప్లాప్ అయిందని, దీంతో నెల రోజులు మౌనంగా ఉన్న హుచ్చ వెంకట్ ఇలా మీడియాలో హడావుడి చేశాడని వారు పేర్కొంటున్నారు.
అంతేకదా… సూసైడ్ చేసుకునే వాడు మీడియాకు, స్నేహితులకు సమాచారం ఇచ్చి మరీ ఎందుకు చేసుకుంటాడు? అలాగే డాక్టర్లను వైద్యం చేయనివ్వకుండా హంగామా చేయడం, ఇవన్నీ సినీ ఫక్కీలో సాగుతున్నాయి తప్ప, ఇందులో ఎక్కడా నిజాయితీ కనిపించడం లేదు. ఇది పక్కా సినిమాటిక్ డ్రామా అన్న విషయం స్పష్టం కావడంతో, పబ్లిసిటీ కోసం ఇలాంటివి కూడా చేస్తుంటారా సినీ జనాలు అన్న రీతిలో సామాన్య ప్రేక్షకులు నోరెళ్ళబెడుతున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు 'నిన్ను అసెంబ్లీ గేటు…
One of the crucial indicators of the potential lifetime performance of any film is based…