
సీ-ఫోర్ సంస్థ ఈ నెల 1-25 తేదీల మధ్య చేపట్టిన ఈ సర్వేలో కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గాను 154 నియోజకవర్గాల్లో దాదాపు 22,357 మంది ఓటర్లను సర్వే సంస్థ పలకరించి వారి మనోగతం తెలుసుకుంది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 119 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేశామని, ఆ పార్టీకి రెండు సీట్లు అదనంగా అంటే 122 సీట్లు వచ్చాయని సీ-ఫోర్ తెలిపింది.
ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీకి 126 సీట్లు వస్తాయని, గతంలో 40 సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈ సారి 70 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని, గతంలో 40 సీట్లను సాధించిన జేడీ(ఎస్) మాత్రం ఈ సారి 27 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. సర్వేలో పాల్గొన్న ఓటర్లు ఎక్కువగా తాగునీటి సమస్యనే ప్రధానంగా ప్రస్తావించారని సీ-ఫోర్ తెలిపింది.
మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే మళ్లీ సీఎం కావాలని దాదాపు 45 శాతం మంది కోరుకుంటున్నారని సీ-ఫోర్ వెల్లడించింది. సీఎంగా బీజేపీకి చెందిన బీఎస్ యడ్యూరప్పకు 26 శాతం మంది, జేడీ(ఎస్) హెచ్‌డీ కుమారస్వామికి 13 శాతం మంది అనుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోడీ మ్యాజిక్ దక్షిణాదిలో పనిచేయదని ఈ సర్వే చెప్తోంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…