
నిఖిల్ లైన్ అప్ లో కార్తికేయ 3 కూడా ఉంది. నిన్న కార్తికేయ 2 విడుదలై ఏడాది అయిన సందర్భంగా నిఖిల్ తెలుగు మీడియాకి పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ ఈవెంట్ కి డైరెక్టర్ చందూ మొండేటి తో పాటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా వచ్చారు.
ఈ సందర్భంగా నిఖిల్ కార్తికేయ 3 కి చందూ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడని ప్రకటించాడు. చందూ మాట్లాడుతూ నిఖిల్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడని హీరో ఎప్పుడంటే అప్పుడు కార్తికేయ 3 ఉంటుందని ప్రకటించాడు.
అయితే ఈ ప్రకటనలే ఇప్పుడు ఇబ్బంది తెచ్చి పెట్టాయి. కార్తికేయ 1 చేసినప్పుడు రిలీజ్ కి ఇబ్బందులు ఎదురయ్యాయట. అప్పుడు భమ్ భోలేనాథ్ సినిమా నిర్మించిన సిరిపురం రాజేష్ వర్మ అనే నిర్మాత ఫైనాన్స్ చేసి రిలీజ్ కి హెల్ప్ చేశారట.
అప్పుడు అగ్రీమెంట్స్ లో కార్తికేయ ఫ్రాంచైజ్ హక్కులు రాజేష్ కు ఇచ్చారట.
అయితే కార్తికేయ 2 కు రాజేష్ నిఖిల్ తో ఉన్న రేలషన్ తో ఎటువంటి డబ్బులు తీసుకోకుండా NOC ఇచ్చారట. ఆ సినిమా లో రాజేష్ కు థాంక్స్ కార్డు కూడా వేశారు.
రాజేష్ కు కార్తికేయ 3 చేసే ఆలోచన ఉందట.
ఇప్పుడు కార్తికేయ 3 తనకు మాట మాత్రం చెప్పకుండా అనౌన్స్ చెయ్యడం, ఇంకో ప్రొడ్యూసర్ తో చెయ్యడానికి రెడీ అయిపోవడం తో రాజేష్ అప్సెట్ గా ఉన్నాడట.
ఇప్పుడు కార్తికేయ 3 వేరే హీరో తో అయినా చేస్తా గానీ నిఖిల్ తో చెయ్యను… అలాగే ఈ ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్తే అన్ని ఆప్షన్స్… (లీగల్ ఆప్షన్స్ సైతం) వాడుకోవడానికి వెనుకాడను అని రాజేష్ తన సన్నిహితులతో అంటున్నాడట.
ఇప్పుడు ఈ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి!
Ranbir Kapoor and Yash starrer mythological film Ramayana Part 1 will be hitting the screens…
Mitchell Starc's participation in IPL 2027 remains uncertain as Australia prepare for a demanding international…