
Karumuri Nageswara Rao arrested by ED in AP liquor case
2024 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంచివాడు, అత్యంత సౌమ్యుడు అంటూ ప్రజలకు పరిచయం చేసిన వైసీపీ అభ్యర్థుల మంచితనం, సౌమ్యత్వం ఏపాటిదో తెలుసుకోవడానికి వైసీపీ నేతల మీద వస్తున్న వేల కోట్ల అవినీతి ఆరోపణలు, అందుకు వారి పై జరుగుతున్న అరెస్టులు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి అని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారిన లిక్కర్ రవాణా కేసులో ఇప్పటికి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదివారం హైదరాబాద్ లోని కొండాపూర్ లో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసారు.
కేసు వివరాలు :
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని మద్యం రవాణా టెండర్ల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఎదురవగా, విచారణ మొదలుపెట్టిన ఈడీ అందుకు ఆధారాలు సేకరించే పని మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ కుమార్, రాజ్ కసిరెడ్డి, ఏపీ బేవరేజేస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ని సైతం అరెస్టు చేసారు.
లిక్కర్ రవాణా టెండర్లలో నిబంధలను ఉద్దేశపూర్వకంగా మార్చి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్ఫోర్ట్ వంటి సంస్థలకు అనుకులంగా వ్యవహరించారని, దాని ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 195 కోట్ల నష్టం చేకూరినట్టు ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ మొత్తం ప్రక్రియలో కారుమూరి కుటుంబం ఆర్థికంగా లబ్ది పొందినట్టు ఈడీ భావిస్తుంది. అయితే ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కారుమూరి నాగేశ్వరరావు ఇప్పటికే ముందస్తు బైలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దాదాపు రూ. 350 కోట్లకు పైగా ఉన్న ఈ స్కాం లో తాము జోక్యం చేసుకోబమని అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పడంతో కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అనివార్యం అయ్యింది.
అయితే నాడు వైఎస్ జగన్ సౌమ్యులు, మంచివారు అని పరిచయం చేసిన సాయి రెడ్డి నుంచి మొదలుపెడితే జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వల్లభనేని వంశీ, దువ్వాడ, అంబటి….బొల్లా బ్రహ్మనాయుడు తాజాగా కారుమూరి నాగేశ్వరరావు వరకు…ఇలా అనేకమంది వైసీపీ నాయకులు వివిధ అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటు, అరెస్టులయ్యినవారే.
మరి ఇటువంటి మంచివారు, సౌమ్యుల కోసం జగన్ పరామర్శ యాత్రలు చేయడం, వైసీపీ నాయకులు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందంటూ మీడియా ముందుకొచ్చి ఆరోపణలు గుప్పించడం వైసీపీ కి రాజకీయ లబ్దిని చేకూరుస్తాయా.?
Khushi Dubey knows how to make black feel anything but basic. In this striking photoshoot,…
Following the terrible failure of Coolie, Rajinikanth is all set to return with his next…