Telugu

కరుణానిధి కన్నుమూత!

94 ఏళ్ళ వయసున్న డీఏంకే అధినేత కరుణానిధి తుది కన్నుమూసారు. సోమవారం సాయంత్రం నుండి విషమంగా మారిన కరుణానిధి ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ ఉందన్న సమాచారం ప్రభుత్వానికి అందించడంతో, రాష్ట్రంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలన్నీ తీసుకున్నారు.

[m9ad]

ADVERTISEMENT

సాయంత్రం 6.10 నిముషాలకు కరుణానిధి తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు. గత నెల 24వ తేదీ నుండి కావేరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కరుణానిధికి ఎక్కువ వయసు ఉండడంతో, శరీరం వైద్యానికి సహకరించలేదు. దీంతో పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలో కరుణానిధి నివాసానికి బంధువులు, సన్నిహిత వర్గాలు చేరుకుంటున్నారు.

ముత్తువేల్ కరుణానిధి ప్రస్థానాన్ని పరిశీలిస్తే… దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించిన రాజకీయ చతురుడుగా పేరుగాంచారు. అభిమానులు ముద్దుగా ‘కలైంగర్’ అని పిలుచుకుంటారు. 1969-2011 మధ్య కాలంలో ఐదు పర్యాయాలు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా తమిళ గడ్డను పాలించారు. రాజకీయాల్లోకి రాకముందు తమిళ సినీ పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా పని చేశారు.

తమిళంలో కథలు, నాటకాలు, నవలలులాంటివెన్నో రాశారు. తమిళ లిటరేచర్ కు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది. స్కూలు రోజుల్లోనే డ్రామా, పొయెట్రీ, రచనపై ఆసక్తి ఉన్న కరుణ… తన 14వ ఏట సాంఘిక పోరాటాల వైపు అడుగులు వేశారు. తన కెరీర్ ను స్క్రీన్ రైటర్ గా ప్రారంభించిన కరుణ… తొలిసారి ‘రాజకుమారి’ చిత్రం కోసం పని చేశారు. ఈ సినిమా హీరో ఎంజీఆర్.

ఆ తర్వాత కరుణ, ఎంజీఆర్ ల మధ్య చాలా కాలం పాటు స్నేహం కొనసాగింది. రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరూ దూరమయ్యారు. ఆ తర్వాత శివాజీ గణేషన్ సినిమాలతో పాటు మరెన్నో చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. 33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే ట్రెజరర్ గా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు.

1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కరుణానిధి, 1969లో అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. డీఎంకే తొలి అధినేత కరుణానిధే కావడం గమనార్హం. పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై ఉన్నంత కాలం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉన్నారు.

చలనచిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన తొలి వ్యక్తి కరుణ. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించిన సమయంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలలో డీఎంకే మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ఆ సందర్భంగా ఎంతోమంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనతాపార్టీతో కరుణ పొత్తు పెట్టుకున్నారు. దీనికి కొన్నేళ్ల ముందే పార్టీ నుంచి ఎంజీఆర్ ను కరుణ బహిష్కరించారు. 1987లో ఎంజీఆర్ చనిపోయేంత వరకు పలు ఎన్నికల్లో డీఎంకే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Aadarsha Kutumbam Trailer Launch Sparks Campus Worry

The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…

25 minutes ago

Ramayana Faces a Crucial Test Ahead of Theatrical Release

The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…

54 minutes ago