Telugu

జమ్ము కశ్మీర్‌కి ప్రజా ప్రభుత్వాలు పనికిరావేమో?

జమ్ము కశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులు చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలో గల ‘బైసారన్’ భారత్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధి చెందింది. కనుక ఏటా అక్కడికి దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

ADVERTISEMENT

ఆవిదంగా వచ్చినవారిలో హిందువులను, మగవారిని ఎంపిక చేసుకొని మరీ తుపాకులతో కాల్చి చంపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సహా పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి, సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఈ ఘటన జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాద రాజకీయాలకు అలవాటు పడిన ప్రజాప్రభుత్వాలు పని చేయలేవని మరోసారి స్పష్టం చేసింది. అక్కడ రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలలో ఏది ఎప్పుడు అధికారంలో ఉన్నా ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయి.

కనుక రాష్ట్రంలో ఉగ్రవాదుల ప్రభావం తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ని మూడు భాగాలుగా విడదీసి, గత కొన్నేళ్ళుగా గవర్నర్-మిలటరీ పర్యవేక్షణలో పాలన సాగించింది. అప్పుడు జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులు చేయలేకపోయారు. కనీసం అడుగు పెట్టలేకపోయారు!

కానీ కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ని మళ్ళీ ఏకం చేసి ఎన్నికలు జరిపించడంతో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి జమ్ము కశ్మీర్‌లో మళ్ళీ వేర్పాటువాదుల హడావుడి కనిపిస్తోంది.

కానీ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం వలననే నిన్న ఉగ్రవాదులు దాడి చేయగలిగారని చెప్పవచ్చు.

జమ్ము కశ్మీర్‌లో నేటికీ భారీగా భద్రతా దళాలు మోహరించి ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్న పార్టీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తుంటే ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈవిదంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు.

ఒకవేళ ఇదే ఘటన దేశంలో మరే రాష్ట్రంలో జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. కానీ జమ్ము కశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ సమస్య తమది కాదు ప్రధాని మోడీ, భద్రతా దళాలదే అన్నట్లు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తోంది.

అంటే జమ్ము కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీలకు పదవి, అధికారం, దాంతో లభించే డబ్బు, పలుకుబడి, విలాసవంతమైన జీవితం కావాలి కానీ రాష్ట్రం, ప్రజల సాదక బాధకాలు, ముఖ్యంగా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న పర్యాటకుల భద్రత పట్టదన్న మాట!

ఈ ఉగ్రదాడిపై మరికొన్ని రోజులు వార్తలు వస్తాయి. ఆ తర్వాత అందరూ ఈ ఘటన మరిచిపోతారు. కానీ తమ కళ్ళ ముందు జరిగిన ఈ మారణకాండని మృతుల కుటుంబాలు ఎన్నటికైనా మరిచిపోగలవా?అంటే కాదనే చెప్పాలి.

జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాద ధోరణితో వ్యవహరించే రెండు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలలో అధికారంలోకి వస్తే ఇలాంటి దాడులు, విషాద ఘటనలు తప్పక జరుగుతాయని ‘ఎం9 న్యూస్’ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే చెప్పింది. అదే జరిగింది. బహుశః ఇక ముందు కూడా పునరావృతం కావచ్చు.

కనుక జమ్ము కశ్మీర్‌కి ప్రజా ప్రభుత్వాలు పనికిరావు. ఉగ్రవాదులను, వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచివేసి సామాన్య ప్రజలు ప్రశాంత జీవనం సాగించేందుకు గవర్నర్ పాలనే మంచిదనిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

9 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

39 minutes ago